Site icon HashtagU Telugu

City Buses : ఆర్టీసీ మెగాప్లాన్.. మెట్రో లేని రూట్లలో 10 నిమిషాలకో బస్సు

City Buses

City Buses

City Buses : హైదరాబాద్‌లో మెట్రో లేని మార్గాల్లో 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్‌ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌- మణికొండ మార్గాన్ని ఎంచుకుని 47ఎల్‌ నంబరుతో సిటీ బస్సులు నడుపుతోంది. 222 ఎల్‌(లింగంపల్లి – కోఠి) బస్సులకు సైతం సమయాలను ఇప్పటికే నిర్దేశించారు. ఈ రెండు రూట్లలో ప్రయోగాత్మకంగా 10 నిమిషాలకో బస్సు నడపనున్నారు. ఈవిషయాన్ని గ్రేటర్‌జోన్‌ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

47ఎల్‌ బస్సు సికింద్రాబాద్‌- మణికొండ మధ్య నడుస్తుంది. ఇది తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. మరోవైపు ఈ బస్సు(City Buses) మణికొండ నుంచి ఉదయం 5.15కు బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మణికొండకు రాత్రి 11.15 గంటలకు చేరుకుంటుంది. కోఠి- లింగంపల్లి మధ్య కూడా 222 ఎల్‌ నంబరుతో బస్సులు వేకువజాము నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read :MLC by election : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది

మరోవైపు హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెట్రో ప్రారంభమయ్యే టెర్మినల్స్‌లో చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు బయల్దేరనుండగా.. ప్రస్తుతం ఆ సమయాన్ని కాస్త పెంచారు. ఇక నుంచి ప్రతి టెర్మినల్‌లో రాత్రి 11.45 గంటలకు చివరి ట్రైన్ బయల్దేరనుంది. అదే విధంగా ప్రస్తుతం మెట్రో ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుండగా.. ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది.ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు సమాచారం.

Also Read :Pokhran Nuclear Tests : భారత్ తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు.. ‘ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధా’ విశేషాలివీ