తెలంగాణ(Telangana)కు పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Padma Awards) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు అవార్డులు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న రేవంత్.. ఈ వివక్షపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు ఇస్తూ, తెలంగాణకు న్యాయం చేయలేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు. వర్సిటీల వైస్ చాన్సెలర్ నియామకాలను యూజీసీ ఆధ్వర్యంలో చేపట్టే ప్రయత్నం రాష్ట్రాల ప్రతిపత్తిపై దాడి కిందకే వస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు.
Jagan- Bharati: జగన్- భారతి మధ్య విభేదాలు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!
తెలంగాణకు కేవలం ఇద్దరికే అవార్డులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర సిఫారసు చేసిన పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడం రాష్ట్ర ప్రజలను కించపరచినట్టే అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వలేదని తక్షణ చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. పద్మ అవార్డ్స్ విషయంలో కేంద్రం చూపిన వివక్ష పట్ల తెలంగాణ ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి తగిన గౌరవం ఇవ్వకుండా వివక్ష చూపించడం అన్యాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పద్మ అవార్డుల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, రాష్ట్రాల ప్రతిపత్తికి విలువ ఇవ్వాలని వారు కోరుతున్నారు.
పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే ..
2025 సంవత్సరానికి గానూ మొత్తం 139 మందిని కేంద్రం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో ఏడుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి (పద్మ విభూషణ్) మరియు మందకృష్ణ మాదిగ (పద్మశ్రీ) లకు అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి నందమూరి బాలకృష్ణ (పద్మభూషణ్), KL కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, వద్దిరాజు రాఘవేంద్రాచార్య, మిర్యాల అప్పారావ్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.