KCR : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం ముందు ఉంచనుంది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 10 కీలకమైన అంశాలను చర్చించడానికి పట్టుబట్టాలని ఒత్తిడి తీసుకురానున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నది. ప్రతిపక్షంలో ఉండగా ఆయా వర్గాలను మభ్యపెట్టి, అధికారంలోకి రాగానే అన్నింటినీ అమలు చేస్తామని అలవికాని హమీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది.
కాగా, అసెంబ్లీలో బీఆర్‌ఎస్ లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే..
1) నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ
2) శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం
3) చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
4) ఆరు గ్యారెంటీల అమలు.. శాసనసభలో చట్టబద్ధత
5) రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగం
6) పంటల మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం-రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదురొంటున్న ఇబ్బందులు
7) గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం – పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం
8) ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదురొంటున్న సమస్యలు.
Read Also: Rana Naidu 2 : రానా నాయుడు 2 మొదలైంది..!