BRS-YCP :కోర్టుల్లో అవినాష్,క‌విత‌కి షాక్ !ఇక అరెస్ట్ త‌థ్య‌మా?

అవినాష్ , క‌విత అరెస్ట్ ల(BRS-YCP) వ్య‌వ‌హారం న్యాయ వ్య‌వ‌స్థ‌ల్లోని (Courts)

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 01:11 PM IST

ఏపీలో అవినాష్ తెలంగాణ‌లో క‌విత అరెస్ట్ ల(BRS-YCP) వ్య‌వ‌హారం ఉత్కంఠ‌ను రేపుతోంది. న్యాయ వ్య‌వ‌స్థ‌ల్లోని(Courts) అవ‌కాశాల‌ను అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈడీ విచార‌ణ‌పై క‌విత సుప్రీం కోర్టులో వేసిన పిటిష‌న్ ను ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. అలాగే, సీబీఐ విచార‌ణ ఆపాల‌ని కోరుతూ తెలంగాణ హైకోర్టులో అవినాష్ వేసిన మ‌ధ్యంత‌ర పిటిష‌న్ ను త్రోసిబ‌చ్చింది. దీంతో అటు క‌విత ఇటు అనినాష్ రెడ్డి ఏమి చేయ‌బోతున్నారు? అనేది రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సామాన్యుల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏపీలో అవినాష్ తెలంగాణ‌లో క‌విత అరెస్ట్ ల ఉత్కంఠ‌ (BRS-YCP)

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య సూత్ర‌ధారి క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి(BRS-YCP) అంటూ సీబీఐ తేల్చింది. ఆ మేర‌కు కోర్టుల‌కు(Courts) తెలియ‌చేసింది. కొన్ని ఆధారాల‌ను కూడా స‌మ‌ర్పించింది. గుగూల్ టేకౌట్ ప‌రిజ్ఞానంతో కేసును దాదాపుగా సీబీఐ తేల్చేసింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డం మాత్ర‌మే ఇక మిగిలి ఉంది. ఇప్ప‌టికి ఐదుసార్లు అవినాష్ ను సీబీఐ విచారించింది. నాలుగేళ్లుగా సాగుతోన్న ఈ హ‌త్య కేసు విచార‌ణ ఒక కొలిక్కి వ‌చ్చింది. అయితే, న్యాయ వ్య‌వ‌స్థ‌లోని కొన్ని అంశాల‌ను సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని అవినాష్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. సీబీఐ విచార‌ణ నుంచి త‌ప్పించాల‌ని, అరెస్ట్ చేయ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోరారు. విచారించిన హైకోర్టు సీబీఐ విచార‌ణ‌ను అడ్డుకోవ‌డానికి కుద‌ర‌ద‌ని తేల్చేసింది. అయితే, విచార‌ణ సంద‌ర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాల‌ని మాత్రం సీబీఐకి సూచించింది.

Also Read : Delhi Tour : కేసీఆర్ దూత‌గా జ‌గ‌న్?, ఢిల్లీకి ప‌యనం!

ఏపీ ప‌రిధిలో సీబీఐ విచార‌ణ చేసినంత కాలం వంద‌లాది మందిని విచార‌ణ చేసిన‌ప్ప‌టికీ దర్యాప్తు ముందుకు క‌ద‌ల్లేదు. ఆ రాష్ట్రంలో న్యాయం జ‌ర‌గ‌ద‌ని వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. ఆమె పిటిష‌న్ ను ప‌రిశీలించిన త‌రువాత మ‌రో రాష్ట్రానికి సీబీఐ ద‌ర్యాప్తును(BRS-YCP) మార్చాల‌ని తీర్పు చెప్పింది. దీంతో తెలంగాణ‌కు మారిన వివేకా హ‌త్య కేసు విచార‌ణ వేగ‌వంతం అయింది. ఆ రోజు నుంచి తాడేప‌ల్లి వ‌ర్గాల‌కు విచార‌ణ తాకింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, వైఎస్ భార‌తి పీఏ న‌వీన్ ను సీబీఐ విచారించింది. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని వెంట‌వెంట‌నే విచారించ‌డంతో అరెస్ట్ ఖాయ‌మ‌నుకున్నారు. ఆ లోపుగా ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల ఆశీస్సులను ఏపీ ప్ర‌భుత్వం పొందింద‌ని వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత అనుమానం. అలాగే, ప్ర‌త్య‌ర్థి పార్టీల ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు (Courts)కూడా సీబీఐ విచార‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ త‌థ్య‌మ‌ని విశ్వ‌సించే వాళ్లు అనేకం.

థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తోన్న ఈడీ అంటూ ఆరోప‌ణ‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత ఈడీ విచార‌ణ కూడా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి (BRS-YCP)విచార‌ణ మాదిరిగా మ‌లుపులు తిరుగుతోంది. న్యాయ వ్య‌వ‌స్థ‌లోని కొన్ని అంశాల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి క‌విత సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు. థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తోన్న ఈడీ అంటూ ఆరోప‌ణ‌లు చేస్తూ విచార‌ణ చేసే ప‌ద్ధ‌తిని మార్పు చేయాల‌ని కోరారు. మ‌హిళ‌కు ఉండే వెసుల‌బాటును గుర్తు చేస్తూ సాయంత్రం 6 గంట‌ల‌కు విచార‌ణ ముగించాల‌ని సూచించారు. అంతేకాదు, లాయ‌ర్ స‌మ‌క్షంలో వీడియో రికార్డ్ ద్వారా విచార‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తూ పిటిష‌న్ వేశారు. ఆ పిటిష‌న్ ప‌రిశీలించిన సుప్రీం కోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. స‌మ‌న్లు జారీ చేసిన ప్ర‌కారం ఆ లోపు గురువారం నాడు క‌విత‌ను ఈడీ విచారించాలి. అయితే, హైడ్రామాను న‌డిపిన ఆమె ఈడీ విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. దీంతో ఈనెల 20వ తేదీన హాజరు కావాల‌ని మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. అందుకే, ఈనెల 20వ తేదీ లోపు త‌న పిటిష‌న్ మీద విచార‌ణ జ‌ర‌పాల‌ని శుక్ర‌వారం మ‌రోసారి సుప్రీం కోర్టును(Courts) క‌విత కోరారు. అందుకు సుప్రీం కోర్టు తిర‌స్క‌రించ‌డంతో క‌విత అరెస్ట్ ఈనెల 20న ఉంటుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ స్థాయి లాబీయింగ్

అటు అవినాష్‌, ఇటు క‌వితను అరెస్ట్ ల (BRS-YCP)నుంచి త‌ప్పించ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ స్థాయి లాబీయింగ్ కోసం వెళ్లార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇంకో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న కుమార్తె ను కాపాడుకునేందుకు ఢిల్లీ లాబీయింగ్ ను పెద్ద ఎత్తున చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్. కేంద్ర ప్ర‌భుత్వంతో ఇద్ద‌రు సీఎంలు ప‌ర‌స్ప‌రం అవగాహ‌న‌తో లైజ‌నింగ్ చేస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని వినికిడి. న్యాయ వ్య‌వ‌స్థ‌లోని అంశాలు కూడా సానుకూలంగా లేక‌పోవ‌డంతో ఇరు రాష్ట్రాల సీఎంలు ఇంట్లో వాళ్ల‌ను కాపాడుకునేలా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని చెప్పుకోవ‌డం మామూలే.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్  సౌత్ గ్రూప్ హెడ్ గా క‌విత (BRS-YCP)

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఇరు రాష్ట్రాల‌ను తాగింది. సౌత్ గ్రూప్ హెడ్ గా క‌విత ఉండ‌గా, (BRS-YCP)ఆ గ్రూప్ లో వైసీపీకి చెందిన ఎంపీ ప్ర‌మేయం బ‌య‌ట‌ప‌డింది. లిక్కర్ కాంట్రాక్ట‌ర్ గా కొన్ని ద‌శాబ్దాల నుంచి ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈనెల 18న ఈడీ ఎదుట హాజ‌రు కానున్నారు. ఆయ‌న కుమారుడు రాఘవ‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. ప్ర‌ధాన నిందితులుగా ఉన్న రామ‌చంద్ర పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు క‌స్ట‌డీని(Courts) పొడిగించారు. వాళ్ల‌తో క‌లిపి క‌విత‌ను విచారించ‌డానికి ఈడీ ప్లాన్ చేస్తోంది. అదే జ‌రిగితే, మొత్తం లిక్క‌ర్ స్కామ్ బండారం బ‌య‌ట ప‌డుతుంద‌ని ద‌ర్యాప్తు సంస్థ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ఆ ఇద్దరి అరెస్ట్ విష‌యంలో రాజ‌కీయ ఎంత బ‌లంగా ప‌నిచేస్తుందో చూద్దాం.!

Also Read : Kavitha :ఉత్కంఠ‌కు తెర‌, మ‌ళ్లీ ఈడీ నోటీసులు,20న విచార‌ణ‌