BRS Survey : తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు త్వరలోనే ఏడాది పూర్తవుతుంది. ఈసందర్భంగా హస్తం పార్టీ సర్కారు పనితీరుపై బీఆర్ఎస్ ఓ రహస్య సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో సీఎం రేవంత్‌కు సంబంధించి కూడా పలు ప్రశ్నలు ఉండటం గమనార్హం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా ఢీకొనే వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకే బీఆర్ఎస్(BRS Survey) ఈ సర్వేను నిర్వహిస్తోంది. ఓ ప్రైవేటు సంస్థతో ఈ సర్వేను చేయిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో ప్రస్తుతం ఎలా ఉన్నాయి ? వాటి పనితీరులోని ప్రతికూల అంశాలు ఏమిటి ? ఆయా అంశాలను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్లస్ పాయింట్లుగా ఎలా మార్చుకోవచ్చు ? అనేది తెలుసుకునేందుకే గులాబీ దళం ఈ సర్వే చేయిస్తోంది.
Also Read :Anmol Bishnoi : లారెన్స్ సోదరుడు అన్మోల్‌ను ఇండియాకు తీసుకొచ్చే యత్నాలు స్పీడప్
బీఆర్ఎస్ సర్వేలో సీఎం రేవంత్‌కు సంబంధించిన ప్రశ్నలివీ..
- రేవంత్ కాకుండా వేరే వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎలా ఉంటుంది ?
- సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది?
- ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ ఏ మేరకు అమలు చేశారు?
- సీఎం రేవంత్ భాష తీరు.. ప్రతిపక్షాలు, కేసీఆర్‌పై చేస్తున్న కామెంట్లతో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది?
- సీఎంగా రేవంత్ కరెక్టేనా? కాంగ్రెస్‌లో ఇతరులు ఎవరైనా సీఎంగా ఉంటే బాగుంటుందా?
- తెలంగాణ అభివృద్ధి రేవంత్‌తో సాధ్యమవుతుందా?
- తెలంగాణకు పరిశ్రమలను తీసుకురావడంలో సీఎం రేవంత్ సఫలం అయ్యారా ?
- తెలంగాణ నుంచి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడానికి కారణాలు ఏమిటి?
- నిరుద్యోగులకు, విద్యార్థులకు సీఎం రేవంత్ భరోసా ఇవ్వగలిగారా ?
Also Read :NSSO Survey : తెలంగాణలో అప్పుల ఊబిలో 42 శాతం మంది.. ఎన్ఎస్ఎస్‌ఓ సంచలన నివేదిక
సర్వేలో ఇతర ముఖ్య ప్రశ్నలివీ..
- హైదరాబాద్ తరహాలో తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థ ఏర్పాటుపై ప్రజలు ఏమనుకుంటున్నారు ?
- మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ?
- రామన్నపేటలో అదానీ సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు ?