Fire Accident : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం రాయికల్ గ్రామ శివారులోని బీఆర్‌ఎస్ ఆయిల్స్ పరిశ్రమలో రాత్రి పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలిపోవడం తో భారీగా మంటలు చెలరేగాయి. బాయిలర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైంది. భారీ శబ్దాలతో పాటు ఎగసిన మంటలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఘటన స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యేలా చేసింది.
Trump Tower Hyderabad : త్వరలో హైదరాబాద్‌కు ట్రంప్ కుమారులు.. కారణం ఇదే
ప్రమాదం వివరాలు
బాయిలర్ పేలడంతో ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉన్న ట్యాంకర్ పూర్తిగా ధ్వంసమైంది. మంటలు విపరీతంగా వ్యాపించడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో నాలుగు ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి.
బాయిలర్ పేలుడు కారణంగా మిగతా ట్యాంకర్లు కూడా పేలే ప్రమాదం ఉందన్న ఆందోళన చోటుచేసుకుంది. పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు 30 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదని నిర్ధారించారు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు విచారిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా పరిశ్రమకు వాటిల్లిన ఆర్థిక నష్టం ఇంకా అంచనా వేయాల్సి ఉంది. పరిశ్రమ సమీపంలోని నివాస ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కంపెనీ నిర్వాహకులు, కార్మికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
ఫైరింజన్ల సిబ్బంది అప్రమత్తంగా పని చేస్తూ మిగతా ట్యాంకర్ల వ్యాపించకుండా వాటిని రక్షించేందుకు కృషి చేశారు. ప్రమాదం కారణంగా సమీప ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో సంభవించిన భారీ శబ్దాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాయికల్ గ్రామ ప్రజలు భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలు విపరీతంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో కాలుష్యం వ్యాపించింది.
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక