BRS : కుటుంబ రాజకీయాలు, కొందరు నేతల పెత్తందారీతనం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈనేపథ్యంలో దిద్దుబాటు చర్యలను బీఆర్ఎస్(BRS) మొదలుపెట్టింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు ‘రీజియనల్ మంత్ర’ను రెడీ చేసుకుంటోంది. ఇంతకీ ఏమిటిది ? వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీంతో నేషనల్ పార్టీగా బీఆర్ఎస్ అవతరిస్తుందని అందరూ భావించారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. దీంతో ఇప్పుడు తోటి ప్రాంతీయ పార్టీల సంస్థాగత నిర్మాణాన్ని అధ్యయనం చేసే ప్రక్రియను బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ప్రత్యేకించి తమిళనాడులోని డీఎంకే, బెంగాల్‌లోని టీఎంసీ, ఒడిశాలోని బీజేడీ లాంటి పార్టీలను ఇందులో భాగంగా స్టడీ చేయనుంది. ఇవన్నీ కుటుంబ రాజకీయాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే కావడం గమనార్హం. డీఎంకేను కరుణానిధి ఫ్యామిలీ, బీజేడీని నవీన్ పట్నాయక్ ఫ్యామిలీ, టీఎంసీని మమతా బెనర్జీ ఫ్యామిలీ నడిపిస్తున్నాయి. కుటుంబ మూలాలతో ఉన్నా.. సంస్థాగతంగా అవి చాలా బలంగా ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అవి ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఓటమి ఎదురైన సందర్భాల్లోనూ వాటి క్యాడర్ చెక్కుచెదరలేదు. అందుకే ఆయా పార్టీల గురించి బీఆర్ఎస్ ఇప్పుడు అధ్యయనాన్ని మొదలుపెట్టింది.
Also Read :Sabarmati Express : పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏమైందంటే ?
ఈ అధ్యయనం కోసం వచ్చే నెలలో(సెప్టెంబరులో) కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది. బీఆర్ఎస్ ఏర్పాటై రెండు దశాబ్దాలకుపైగా గడిచింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. ఈక్రమంలోనే ఇటీవలే డీఎంకే నేత సురేశ్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం, వైసీపీకి చెందిన పలు అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ టీమ్ పరిగణలోకి తీసుకోబోతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి ? క్యాడర్‌కు శిక్షణ ఎలా అందించాలి ? ప్రజల్లో మమేకమయ్యే తీరు ఎలా ఉండాలి ? ప్రజా సమస్యలపై పోరాటాలు ఎలా చేయాలి ? పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు ఎలా ఇవ్వాలి ? వంటి అంశాలను ఈ టీమ్ స్టడీ చేయనుంది. ఈ అధ్యయనం తర్వాత బీఆర్ఎస్ సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.