BJP Announced MLC Candidates: తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ అభ్యర్థులను (BJP Announced MLC Candidates) ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్రకటించగా.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్యను ప్రకటించింది. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Hair Care Tips: ఈ సీజన్‌లో మీ జుట్టును కాపాడుకోండి ఇలా!
పులి సరోత్తం రెడ్డి (వరంగల్)
వరంగల్‌కు చెందిన పులి సరోత్తం రెడ్డి 21 సంవత్సరాలకుపైగా పాఠశాల సహాయకుడిగా (స్కూల్ అసిస్టెంట్), ప్రధానోపాధ్యాయుడిగా 10 సంవత్సరాలు పని చేశారు. 2012 నుండి 2019 వరకు PRTU ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో భాగంగా ఆయన చాలా చురుకుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా తనదైన శైలిలో కృషి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు.
కొమురయ్య
మల్కా కొమరయ్య స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి. కొమురయ్య ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఈ పూర్తి చేశారు. తదనంతరం పాఠశాలలను స్థాపించి పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు విశేషమైన కృషి చేశారు. కొమురయ్య పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లో విద్యాసంస్థలను స్థాపించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పల్లవి గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు.
అంజి రెడ్డి
సి. అంజి రెడ్డి స్వస్థలం మెదక్ జిల్లా రామచంద్రపురం. అంజి రెడ్డి BA మ్యాథ్స్ గ్రాడ్యుయేట్. ఈయన విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈయన బాల్యం నుండి జాతీయవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన భార్య గోదావరి అంజిరెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అంజి రెడ్డి గత 20 సంవత్సరాలుగా SR ట్రస్ట్‌ని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ గ్రామాల్లోని పేదల విద్యాభివృద్ధికి, మంచి నీరు అందించడానికి చురుకుగా పని చేస్తోంది.