Rs 70 Lakhs Bitcoins Looted : బిట్ కాయిన్లు.. చాలా కాస్ట్లీ గురూ !! వాటి రేటు చాలా ఎక్కువ. ఒక బిట్ కాయిన్ రేటు ప్రస్తుతం రూ.87 లక్షలకుపైనే ఉంది. అందుకే బిట్ కాయిన్ల దొంగతనానికి హ్యాకర్లు ప్రయారిటీ ఇస్తుంటారు. వాటిని దొంగిలించేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా అందిపుచ్చుకుంటారు చోరులు. ఈక్రమంలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి హ్యాకర్ల బారినపడి రూ.70 లక్షలు విలువైన 15 బిట్ కాయిన్లను పోగొట్టుకున్నాడు.
Also Read :Anil Ambani : అచ్యుతాపురం సెజ్ వైపు.. అనిల్ అంబానీ చూపు.. ఎందుకు ?
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన యాదయ్య వద్ద 15 బిట్ కాయిన్లు(Rs 70 Lakhs Bitcoins Looted) ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.70 లక్షల దాకా ఉంటుంది. గత ఎనిమిదేళ్లుగా వాటిని యాదయ్య సురక్షితంగా దాచుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలో మూడు రోజుల క్రితం యాదయ్యకు టెలిగ్రామ్ యాప్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. తాము బిట్ కాయిన్ షేర్లను ప్రమోట్ చేస్తుంటామని చెబుతూ.. సదరు వ్యక్తి యాదయ్యతో పరిచయం చేసుకున్నాడు. బిట్ కాయిన్ ట్రేడింగ్ ద్వారా రివార్డ్ పాయింట్ల రూపంలో వచ్చిన డబ్బులను రీడీమ్ చేసుకోవాలని యాదయ్యను కోరాడు. ఇందుకు యాదయ్య అంగీకరించాడు. ఆ వ్యక్తి చెప్పిన ప్రాసెస్ ప్రకారం రివార్డు పాయింట్లను రీడీమ్ చేసుకునేందుకు యాదయ్య యత్నించాడు. అయితే డబ్బులు అతడి బిట్ కాయిన్ అకౌంటుకు యాడ్ కాలేదు. దీంతో పరేషాన్ అయ్యాడు.
Also Read :Robbers In Trains : సంక్రాంతి రద్దీ.. రైళ్లలో దొంగల ముఠాలు.. పారా హుషార్
ఈక్రమంలో యాదయ్యకు చెమటలు పట్టాయి. ఈసందర్భంగా టెలిగ్రామ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి మరోసారి యాదయ్యతో ఛాటింగ్ చేశాడు. తనకు బిట్ కాయిన్ అకౌంటు పాస్ వర్డ్‌ను చెబితే చెక్ చేస్తానని అవతలి వైపున్న వ్యక్తి.. యాదయ్యను బుకాయించాడు. అతడి మాటలు నమ్మిన యాదయ్య వెంటనే పాస్‌వర్డ్ పంపాడు. దాన్ని వాడుకొని సదరు వ్యక్తి వెంటనే యాదయ్య బిట్ కాయిన్ అకౌంటును హ్యాక్ చేసి.. 15 బిట్ కాయిన్లను దొంగిలించాడు. వాటి విలువ దాదాపు రూ.70 లక్షల దాకా ఉంటుంది. ఈవిషయాన్ని గుర్తించి యాదయ్య లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నాడు. వెంటనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. వనపర్తి సైబర్ క్రైం డీఎస్పీ రత్నంను కలిసి కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.