Site icon HashtagU Telugu

OU University : ఓయూ విద్యార్థులకు భరోసా ఇచ్చిన భట్టి

Ou University Water Problem

Ou University Water Problem

ఈ ఏడాది వర్ష ప్రభావం తక్కువగా ఉండడంతో నీటి సమస్య తీవ్రతరం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) అన్ని చెరువు లు , కుంటలు ఎండిపోవడంతో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్ (Hyderabad) లో మరి దారుణంగా తయారైంది. నగర వ్యాప్తంగా నీటి సమస్య వెంటాడుతుంది. యూనివర్సిటీల్లోనూ (OU University), కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నీళ్ల కొరత తో ఓయూలోని విద్యార్థులు (OU Stundes) ఆందోళన చేపట్టారు. నిన్న నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడడంతో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదని వాపోయారు. నీటి కొరత, విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ లో హాస్టల్స్ మూసివేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ నోటీస్ ఇచ్చారు. నెల రోజుల పాటు హాస్టల్స్ ముసివేస్తున్నాట్లు ప్రకటించారు. దీనికి విద్యార్థులు సహకరించాలని విజ్ఞాప్తి చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో..దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, నీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై విచారణకు ఆదేశించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. వెనువెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారని విక్రమార్క తెలిపారు. నీటి కొరత కారణంగా మే ఒకటి నుంచి.. 31 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన చేశారని.. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైనట్టు గమనించి.. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని.. నిశ్చింతగా యూనివర్సిటీలో ఉండి స్వేచ్ఛగా చదువుకోవచ్చన్నారు.

Read Also : Mutton Pulusu : మటన్ పులుసు.. ఇలా చేస్తే ముక్క వదలకుండా తింటారు..