Basara IIIT : త్రిపుల్ ఐటీ వార్, ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ 48 గంట‌ల డెడ్ లైన్

బాస‌ర  త్రిపుల్ ఐటీ  (Basara IIIT )కేంద్రంగా సీఎంవో, రాజ‌భ‌వ‌న్ మ‌ధ్య వివాదం రాజుకుంటోంది.ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంపై గ‌వ‌ర్న‌ర్ నివేదిక కోరారు

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 03:19 PM IST

బాస‌ర  త్రిపుల్ ఐటీ  (Basara IIIT )కేంద్రంగా మ‌రోసారి సీఎంవో, రాజ‌భ‌వ‌న్ మ‌ధ్య వివాదం రాజుకుంటోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు విద్యార్థినులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై నివేదిక కోరారు. రాబోవు 48 గంట‌ల్లో నివేదిక కావాల‌ని డెడ్ లైన్ పెట్టారు. ఆ మేర‌కు సీఎంవో ఆఫీస్ కు తాఖీదు పంపారు. అలాగే, విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌ను కోరారు. గ‌తంలోనూ యూనివ‌ర్సిటీల విష‌యంలో గ‌వ‌ర్న‌ర్, సీఎంవో మ‌ధ్య గ్యాప్ ఉంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచ‌న మేర‌కు న‌డిచే సీఎంవో ఆఫీస్ గ‌త కొంత కాలంగా రాజ్ భ‌వ‌న్ కు దూరంగా ఉంటోంది. ప‌లు సంద‌ర్భాల్లో సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ తమిళ సై మ‌ధ్య ప్రొటోకాల్ యుద్ధం జ‌రిగింది. తాజాగా స‌చివాల‌యం ప్రారంభోత్స‌వానికి ఆహ్వానించ‌క‌పోవ‌డం రాద్ధాంతం అయింది.

 మ‌రోసారి సీఎంవో, రాజ‌భ‌వ‌న్ మ‌ధ్య వివాదం (Basara IIIT )

బాస‌ర త్రిపుల్ ఐటీ (Basara IIIT) అనాధ‌గా మారింది. అటు వైపు వెళ్ల‌డానికి సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు. బాస‌రకు వెళితే, ప‌దవులు పోతాయ‌న్న మూఢ‌న‌మ్మ‌కాన్ని పెంచిపోషించారు. అందుకే, అక్క‌డి అమ్మ‌వారి ఆల‌యంలోకి ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ అడుగుపెట్ట‌లేదు. అదే త‌ర‌హాలో బాస‌ర వైపు చూడ‌లేదు. ఏడాది కాలంగా బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప‌డుతోన్న బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. క‌నీస సౌక‌ర్యాల కోసం గ‌త ఏడాది విద్యార్థులు చేప‌ట్టిన ఆందోళ‌న ప్ర‌భుత్వాన్ని కొంత మేర‌క క‌దిలించింది. మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. పైగా వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌తో త్రిపుల్ ఐటీ హ‌డ‌లిపోతోంది.

పాల‌కుల నిర్ల‌క్ష్యంను నిర‌సిస్తూ విద్యార్థి సంఘాలు

రెండు రోజుల క్రితం  (Basara IIIT) యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ లో దీపిక ఉరివేసుకుంది. బాత్‌ రూంలోని కిటికీకి సువ్వ‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆ ఘ‌ట‌న నుంచి తేరుకోక‌ముందే మ‌రో విద్యార్థిని లిఖిత యూనివ‌ర్సిటీ బిల్డింగ్ నాలుగో అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. ఈ రెండు సంఘ‌ట‌న‌ల వెనుక ఏమి జ‌రిగింది? అనేది బ‌య‌ట‌కు రావ‌డంలేదు. పేరెంట్స్, స్టూడెంట్స్ మాత్రం యూనివ‌ర్సిటీ నిర్వాకం మీద ఆందోళ‌నకు దిగారు. పాల‌కుల నిర్ల‌క్ష్యంను నిర‌సిస్తూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి.

గత ఏడాది రాథోడ్‌ సురేష్‌, భాను ప్రసాద్‌ అనే విద్యార్థులు ఆత్మహత్య

యూట్యూబ్‌ చూస్తూ ప్రమాదవశాత్తు భవనం సైడ్‌ వాల్‌ పై నుంచి లిఖిత కింద పడిందని, ఆత్మహత్య కాదని వీసీ వెంకటరమణ ప్రకటించారు. మరోవైపు, కుక్కలు వెంట పడటంతో లిఖిత భయంతో భవనం పైకెక్కిందని, అక్కడి నుంచి కింద పడిపోయిందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు కింద పడిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా భిన్నంగా లిఖిత మ‌ర‌ణం వెనుక వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అధికారుల ఒత్తిడితోనే పేరెంట్స్ ఫిర్యాదు అలా చేశార‌ని విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

Also Read : KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!

గత ఏడాది రాథోడ్‌ సురేష్‌, భాను ప్రసాద్‌ అనే విద్యార్థులు  (Basara IIIT)ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెస్‌లో పురుగుల అన్నం పెడుతున్నారని, కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళన తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. గత ఏడాది 12 డిమాండ్లతో విద్యార్థులు నెల రోజుల పాటు ఆందోళన చేశారు. ఫ‌లితంగా మంత్రి కేటీఆర్‌ బాసరకు వెళ్లి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీలు ఇచ్చారు. ఆరు నెలలకు ఒకసారి క్యాంప్‌సకు వస్తానంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని న‌మ్మారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అటు వైపు చూడ‌లేదు.

 కేసీఆర్ బాస‌ర మీద తొలి నుంచి శీత‌క‌న్ను (Basara IIIT)

మూఢ‌న‌మ్మ‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ బాస‌ర మీద తొలి నుంచి శీత‌క‌న్ను వేస్తున్నారు. అటు వైపు వెళితే, ప‌ద‌వి పోతుంద‌న్న భావ‌న ఆయ‌న‌లో ఉంద‌ని స‌హ‌చ‌రులు చెబుతుంటారు. బాస‌ర అమ్మ‌వారు దేవాల‌యంలోని కొంద‌రు పూజారులు కూడా కేసీఆర్ రావ‌క‌పోవ‌డాన్ని ప్ర‌శ్నిస్తే సెంటిమెంట్ ను వినిపిస్తుంటారు. వాస్త‌వంగా చ‌ద‌వుల త‌ల్లిగా పేరొందిన బాస‌ర అమ్మ‌వారి వ‌ద్ద పిల్ల‌ల‌కు విద్యాభ్యాసం చేయిస్తారు. కానీ, అక్క‌డ‌కు (Basara IIIT) ప‌ద‌వులు పోతాయ‌న్న భావ‌న కొంద‌రు రాజ‌కీయ నేత‌ల్ని వెంటాడుతోంది. ఆ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : BRS plan : జ‌గ‌న్ ఫార్ములాతో ఎన్నిక‌ల‌కు కేసీఆర్ సిద్ధం! వ‌చ్చే 6నెల‌లు న‌గ‌దు బ‌దిలీ!!

వాస్త‌వంగా త్రిపుల్ ఐటీని స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ ఎంతో దూర‌దృష్టితో అక్క‌డ స్థాపించారు. ఆయ‌న త్రిబుల్ ఐటీ యూనివ‌ర్సిటీని ప్రోత్సహించ‌డానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ కూడా పెట్టారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న బాస‌ర త్రిబుల్ ఐటీ సేవ‌ల‌ను అందుబాటులోకి అప్ప‌ట్లో తీసుకొచ్చారు. అంచలంచెలుగా ఎద‌గాల్సిన త్రిబుల్ ఐటీని ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్ప‌డిన త‌రువాత నిర్ల‌క్ష్యం చేశారు. అటు వైపు మంత్రులు చూడ‌డానికి కూడా వెళ్ల‌డంలేదు. ఫ‌లితంగా క‌నీస సౌక‌ర్యాలులేని యూనివ‌ర్సిటీలో. విద్యార్థులు ఒత్తిడికి గుర‌వుతూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. అందుకే, నేరుగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై రంగంలోకి దిగారు. ఆత్మ‌హ‌త్య‌ల‌పై నివేదిక‌ను కోర‌డంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తం అయింది.

Also Read : KCR Politics: కేసీఆర్ ‘మహా’ మాయ, ఎన్నికల బరిలో ఒంటరి!