సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతిచ్చారు. తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేసి, మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగిందంటే ప్రాయశ్చిత్తం చేసుకోండి.. లేకుంటే మౌనంగా ఉండాలంటూ వైసీపీ నాయకులకు చురకలంటించారు. సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే నన్నెవరూ ఆపలేరన్నారు. ఈ నేల అన్ని మతాలను గౌరవిస్తుందని, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలని చెప్పారు. తప్పు చేసిన వాళ్ల నాశనం మొదలైందని పేర్కొన్నారు. సనాతన ధర్మం పాటించే వ్యక్తులు ఇతర మతాలను గౌరవిస్తారు అని పవన్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) మద్దతు ఇచ్చారు. ఎవరైనా సనాతన ధర్మం జోలికి వస్తే హిందువులంతా గొంతెత్తుతామని చెప్పారు. సెక్యులరిజం రెండు దారులున్న వీధి లాంటిదన్నారు. ఇకపై తాము మౌనంగా ఉండబోమని బండి స్పష్టం చేశారు.
Read Also : Tirumala Laddu : తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం – అంబటి రాంబాబు