CM Jagan: సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ నేరుగా నంది నగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం, శాలువా అందించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైస్ జగన్ కేసీఆర్‌తో సమావేశం కావడం ఇదే తొలిసారి. మరోవైపు తన సోదరి వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన రోజే హైదరాబాద్ లో పర్యటించడం, పైగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు. సీఎం జగన్ దాదాపు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ లో అడుగు పెట్టారు. తల్లి విజయమ్మతో సమావేశం తర్వాత ఆయన బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.
Also Read: Sankrnathi Free Bus : సంక్రాంతికి కూడా ఉచితమేనట..