Site icon HashtagU Telugu

Agniveer Recruitment : డిసెంబరు 8 నుంచి హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Agniveer Recruitment Rally Hyderabad

Agniveer Recruitment : తెలంగాణలో పదోతరగతి పాసైన వారికి మంచి అవకాశం. హైదరాబాద్‌లో డిసెంబర్ 8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.  గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ ర్యాలీని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా  అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ ట్రేడ్‌లలో యువతను భర్తీ చేస్తారు.  పదోతరగతి పాసైన వారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ పోస్టులకు అర్హులు. 8వతరగతి పాసైన వారు అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు అర్హులు.

Also Read :CM Cup : డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు ‘సీఎం కప్’ క్రీడోత్సవాలు

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల  అభ్యర్థులు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరుకావచ్చు. అభ్యర్థులకు (Agniveer Recruitment) సందేహాలు ఉంటే రిక్రూట్ మెంట్ కార్యాలయాన్ని 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించొచ్చు.

Also Read :Cake Offerings Ban : ఇన్‌ఫ్లూయెన్సర్ ఓవర్ యాక్షన్.. ఆ ఆలయంలో బర్త్‌డే కేక్ నైవేద్యాలపై బ్యాన్

డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

తెలంగాణలోని  గ్రూప్ 2 అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 4 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, 3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పేపర్ 2, 4 పరీక్షలు జరుగుతాయి. https://www.tspsc.gov.in/ అనే వెబ్‌సైటు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.కాగా, ఇప్పటికే మూడుసార్లు వివిధ కారణాలతో పరీక్ష వాయిదా పడింది.

Also Read :Mokshagna : మోక్షజ్ఞ రెండో సినిమా డైరెక్టర్ అతనేనా..?