Site icon HashtagU Telugu

Adluri Laxman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్‌

Adluri Lakshman takes charge as minister

Adluri Lakshman takes charge as minister

Adluri Laxman : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా నియమితులైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ శుక్రవారం అధికారికంగా తన పదవిని స్వీకరించారు. ఆయనకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖల బాధ్యతలు కేటాయించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయనకు సీనియర్‌ మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, డా. శ్రీధర్‌బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం అడ్లూరి లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడమే నా ముఖ్యలక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులకు సమగ్రమైన అభివృద్ధి కోసం పని చేస్తాను. ప్రభుత్వ పథకాలు వారి దాకా చేరేలా చూడటం నా మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.

Read Also: Amit Shah : పాక్‌కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా

అలాగే ప్రత్యేకించి విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. సమాజంలో హింసకు గురైన, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతే నా ప్రాధాన్య అంశం అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించగా, వారిలో అడ్లూరి లక్ష్మణ్‌ ఒకరు. మిగతా ఇద్దరే గడ్డం వివేక్‌ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి. వీరికి సంబంధిత శాఖలుగా కార్మిక, గనుల శాఖలు మరియు క్రీడలు, యువజన సేవలు, పశుసంవర్థక శాఖలు అప్పగించబడ్డాయి. ఈ తాజా విస్తరణతో రాష్ట్ర మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య 15కి పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈ విస్తరణలో పాత మంత్రుల శాఖలలో ఎలాంటి మార్పులు చేయకుండా, కొత్త మంత్రులకు సీఎం వద్ద ఉన్న ఖాళీ శాఖలే అప్పగించడమే విశేషం.

అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ గతంలో తెలంగాణ పీసీసీలో చురుకైన నాయకుడిగా పనిచేశారు. ఆయన ప్రజల మధ్య మంచి సాన్నిహిత్యం కలిగి ఉండటమే కాకుండా, ప్రత్యేకంగా ఎస్సీ వర్గాల్లో ఆయనకు గట్టి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఆయన నియమించిన శాఖలన్నీ అత్యంత సంక్లిష్టమైనవి కావటంతో, ఆయనపై ప్రభుత్వ ఆశలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, నూతన మంత్రి ప్రజలతో నేరుగా సంభాషించేందుకు త్వరలో హెల్ప్‌లైన్, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇది సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత పెంచే దిశగా ముందడుగు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read Also: Iran-Israel : ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు