Site icon HashtagU Telugu

Ladies Hostel: షాకింగ్.. లేడీస్ హాస్టల్ లో మహిళ స్నానం.. రహస్యంగా ఫోన్ లో చిత్రీకరణ

Vastu Tips For Bathing

Vastu Tips For Bathing

Ladies Hostel: ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. అయితే వారంతా ఎక్కువగా హాస్టల్ లో ఉంటూ చదువుకోవడమో, జాబ్ చేయడమో చేస్తుంటారు. హాస్టళ్లలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది.

తాజాగా వెంగళరావునగర్ లోని ఓ హాస్టల్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తులపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ స్పెక్టర్ డి.మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ హాస్టల్ లో స్నానం చేస్తున్న సమయంలో  వెంటిలేషన్ కిటికీలో ఫోన్ ఉండటాన్ని గమనించింది. ఆమె గదికి అనుబంధంగా ఉన్న ప్రాంగణంలోకి ఏ అబ్బాయి కూడా ప్రవేశించడం అసాధ్యం. దీనికి ఆమె రూమ్ మేట్స్ కారణమై ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా జడ్చర్లకు చెందిన హేమంత్ (29) అనే వ్యాపారి మంగళవారం ఎస్ ఆర్ నగర్ లోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి చెందిన ఓ యువతితో కలిసి నగరానికి వచ్చిన అతడు హోటల్ లో దిగారు. రాత్రి భోజనం చేసి వాష్ రూమ్ లోకి వెళ్లి తిరిగి రాలేదు. యువతి తలుపులు పగులగొట్టి చూడగా హేమంత్ అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.