400 IOCL Jobs : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ఇది మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ చమురు కంపెనీ. ఇందులో 400 ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అయితే అవన్నీ అప్రెంటిస్ పోస్టులు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పుదుచ్ఛేరి, కర్ణాటక, కేరళలోనూ ఈ జాబ్ వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం 400 పోస్టులలో(400 IOCL Jobs) 200 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. మిగతా వాటిలో 105 టెక్నీషియన్ అప్రెంటీస్, 95 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 400 జాబ్స్‌లో 192 యూఆర్ కేటగిరిలో ఉన్నాయి. 103 పోస్టులు ఓబీసీలకు, 37 పోస్టులు ఈడబ్ల్యూఎస్ వారికి, 56 పోస్టులు ఎస్సీలకు 12 పోస్టులు ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ పాసైన వారు అర్హులు. 2024 జులై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లలోపు అప్లై చేయొచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
Also Read :4455 Bank Jobs : ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 జాబ్స్.. లాస్ట్ డేట్ ఆగస్టు 21
అభ్యర్థులు ఆగస్టు 19లోగా https://iocl.com/ వెబ్‌సైటులో దరఖాస్తులను సమర్పించాలి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం http://apprenticeshipindia.org/candidate-registratio వెబ్‌సైటులో అప్లై చేయాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల కోసం https://nats.education.gov.in/student_register.php వెబ్‌సైటులో అప్లై చేయాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం https://myaadhaar.uidai.gov.in/login వెబ్‌సైటులో అప్లై చేయాలి. ఈక్రమంలో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం శాలరీలు, అదనపు భత్యాలు లభిస్తాయి. కంపెనీ నిబంధనలను అనుసరించి కెరీర్‌లో పురోగతి లభిస్తుంది.