3000 Crores Loan : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం తెలంగాణ సర్కార్ రూ.3,000 కోట్ల లోన్ తీసుకోనుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి ఈ లోన్‌ను రాష్ట్రం తీసుకోనుంది. ఈ లోన్ ఇచ్చేందుకు హడ్కో విధించే షరతులను అంగీకరించేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అనుమతిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి(3000 Crores Loan) తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈనెల 11న రాష్ట్ర సర్కార్ ప్రారంభించనుంది.
We’re now on WhatsApp. Click to Join
- హడ్కో ఇచ్చే లోన్‌తో ఇందిరమ్మ ఇళ్ల స్కీంలో భాగంగా తెలంగాణవ్యాప్తంగా తొలి విడతగా 95,235 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు.
- తొలి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయనున్నారు.
- ఈ లోన్‌తో గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇళ్లను నిర్మిస్తామని జీవోలో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ పేర్కొంది.
- ఇందిరమ్మ ఇళ్ల స్కీంలో భాగంగా అర్హులైన వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇస్తారు. ఒకవేళ సొంత జాగా ఉంటే.. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలను అందజేస్తారు.
- తొలి విడతలో స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలను కేటాయించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ కూటమి సీట్ల పంపకాలు ఇలా..
- ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
- సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారి కోసం ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేలిచ్చారు.
- ఇందిరమ్మ ఇళ్లలో తప్పనిసరిగా వంటగది, టాయిలెట్ ఉండేలా చూస్తారు.
- ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఇంజినీరింగ్ విభాగాలకు అప్పగించనున్నారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత మహాలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చారు. దీని కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ పథకానికి కూడా శ్రీకారం చుట్టారు.