Warangal Textile Park: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి అవకాశం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో ఉన్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పార్కులో ఉన్న కైటెక్స్ కంపెనీ వివిధ విభాగాల్లో 25 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులంతా మరో వారంలోగా దరఖాస్తు చేసుకోవాలి. నిరుద్యోగులు కంపెనీ వెబ్‌సైట్ https://job.kitexgarments.com/Vacancies.aspx ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. దాని ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read :Hyderabad Glide Bomb: మేడిన్ హైదరాబాద్ గ్లైడ్ బాంబ్.. ‘గౌరవ్’ సక్సెస్.. ఎలా పనిచేస్తుంది ?
ఈ జాబ్స్ భర్తీ చేస్తారు..
కైటెక్స్ కంపెనీలో వివిధ క్యాటగిరీలలో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబితాలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్లు, ఇన్‌చార్జులతో పాటు జిన్నింగ్, బ్లీచింగ్, డైయింగ్, ప్రింటింగ్, కటింగ్, ఎంబ్రాయిడరీ, పవర్ స్టేషన్, ఫైనాన్స్, ఐటీ, సోర్సింగ్, ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్, హెచ్‌ఆర్, ఫైర్ సేఫ్టీ, బాయిలర్, ఎస్‌టీపీ పోస్టులు ఉన్నాయి. ఇందులో 80 శాతం పోస్టులను మహిళలకే కేటాయించారు. దరఖాస్తుల ఆధారంగా కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read :Vanajeevi Ramaiah : వనజీవి రామయ్య ఇక లేరు.. ఆయన ఖ్యాతికి కారణమిదీ
దక్షిణ కొరియా కంపెనీ 8 ఫ్యాక్టరీలు సైతం..
2017లో తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు(Warangal Textile Park) శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.1,350 కోట్లతో 1,150 ఎకరాల్లో ఈ పార్కు పనులు మొదలు పెట్టారు. 22 కంపెనీలతో సంప్రదింపులు జరిపి రూ.3,900 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో చిన్న పిల్లల దుస్తుల తయారీకి సంబంధించిన కిటెక్స్ గార్మెంట్స్ కంపెనీ రూ.1,200 కోట్ల వ్యయంతో 187 ఎకరాల్లో పిల్లల దుస్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గణేషా ఎకో టెక్ కంపెనీ రూ.588 కోట్లతో సుమారు 50 ఎకరాల్లో రెండు యూనిట్లు నెలకొల్పింది. దక్షిణ కొరియాకు చెందిన యంగాన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అయితే ప్రస్తుతం కేవలం కిటెక్స్ కంపెనీ మాత్రమే ఉత్పత్తి ప్రక్రియను మొదలుపెట్టింది.