YouTube Features : యూట్యూబ్.. ప్రపంచంలోనే నంబర్ 1 వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. ఇది తమ యూజర్ల సౌకర్యార్ధం ఎన్నో కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ వీక్షణ అనుభవాన్ని మరింత బెటర్ చేసేందుకు ఎంతో కసరత్తు చేస్తోంది. తాజాగా యూట్యూబ్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అవేంటో ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
Also Read :Smallest Washing Machine : ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
స్లీప్ టైమర్
చాలామంది యూట్యూబ్ వీడియోలు చూస్తూ నిద్రలోకి జారుకుంటుంటారు. ఓ వైపు యూట్యూబ్ (YouTube Features) వీడియో నడుస్తుంటే.. మరోవైపు మనం నిద్రలోకి జారుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడమే ‘స్లీప్ టైమర్’ ఫీచర్ లక్ష్యం.మనం ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్ వీడియోలకు మనం టైమర్‌ను సెట్ చేయొచ్చు. మనం ఎంచుకున్న టైం ముగియగానే వీడియో ప్లే అవడం ఆగిపోతుంది. ఒకవేళ మనం వీడియోలు చూస్తూ అకస్మాత్తుగా నిద్రపోయినా.. ఆటోమెటిక్‌గా వీడియో ఆగిపోతుంది. మనం యూట్యూబ్‌లో ఏదైనా వీడియోను ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ ఐకాన్‌లో ‘Sleep Timer’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అందులో మనకు నచ్చినంత టైమ్‌ను సెట్ చేయాలి. ప్రస్తుతం ప్రీమియం యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ప్లే లిస్ట్
మనం యూట్యూబ్‌లో వీడియోల ప్లే లిస్ట్‌లను కూడా క్రియేట్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ సాయంతో ఆ ప్లే లిస్టును మనకు నచ్చిన వ్యక్తులకు సెండ్ చేయొచ్చు. ఆ లిస్ట్‌కు అవసరమైన థంబ్ నెయిల్స్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) సాయంతో తయారు చేయొచ్చు. మన ఫొటోలను కూడా థంబ్ నెయిల్‌గా పెట్టొచ్చు.
మినీ ప్లేయర్
మినీ ప్లేయర్ అనే ఫీచర్‌ను యూట్యూబ్ తీసుకొచ్చింది. ఇంతకుముందు మినీ ప్లేయర్ అనేది కుడివైపు కిందిభాగంలోనే ఉండేది. ఇకపై మినీ ప్లేయర్ లొకేషన్‌ను మనం .. ఫోన్ స్క్రీన్‌లో ఏ ప్లేసుకైనా మార్చేసుకోవచ్చు. మినీ ప్లేయర్ సైజులో కూడా మార్పులు చేసుకోవచ్చు. కావాలంటే దాని సైజును పెంచొచ్చు.
బ్యాడ్జ్
యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పుడు యూజర్ల కోసం బ్యాడ్జ్ ఫీచర్‌ను యూట్యూబ్ తెచ్చింది. మొత్తం మీద ఈ ఫీచర్లకు యూజర్లకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తాయి.