Miss AI : ‘మిస్ ఏఐ’ పోటీల ఫైనల్స్‌కు జారా శతావరి.. ఆమె మనిషేనా ?

ఏఐ మాయతో పుట్టుకొచ్చిన అందాల భామలు నెట్టింట్లో సందడి చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 19, 2024 / 02:39 PM IST

Miss AI : ఏఐ మాయతో పుట్టుకొచ్చిన అందాల భామలు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. వాళ్లకు  ‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ ‘మిస్ ఏఐ’ (Miss AI) పోటీలు నిర్వహించింది. తొలిసారిగా  జరిగిన  ఈ పోటీల్లో భారత వనిత జారా శతావరి సత్తా చాటింది. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 1500 మంది ఏఐ మోడల్స్‌, ఇన్‌‌ఫ్లూయెన్సర్లు పాల్గొనగా.. 10 మందిని ఫైనల్స్‌కు ఎంపిక చేశారు. ఈ లిస్టులో మన దేశానికి చెందిన జారా శతావరి చోటును సంపాదించారు.  మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌ వంటి కాంపిటీషన్స్‌లాగే ఈ పోటీల్లో పాల్గొన్నవారి ప్రతిభను పరీక్షించి గెలిచినవారికి ‘మిస్‌ ఏఐ’ టైటిల్‌‌ను ప్రదానం చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మిస్ ఏఐ పోటీల్లో పాల్గొనే అందాల భామల లుక్స్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. వీరిని ఏఐలో సృష్టించడం కోసం ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాలను పరిగణిస్తారు. సోషల్‌ మీడియాలో ఏఐ పాత్రలు చూపుతున్న ప్రభావాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఈ అంశాలపై విశ్లేషణ చేసి కచ్చితమైన తీర్పును వినిపించడానికి మొత్తం నలుగురు న్యాయనిర్ణేతలు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లే కావడం విశేషం.  ‘మిస్‌ ఏఐ’ విజేత ఎవరు అనేది త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Also Read : 484 Jobs : టెన్త్ పాసయ్యారా ? బ్యాంకులో 484 జాబ్స్ మీకోసమే

జారా శతావరి ఎవరు ?

  • భారత్‌కు చెందిన మొబైల్‌ యాడ్‌ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ చౌదరి ఓ ఏఐ అందాల భామను క్రియేట్ చేశారు. దానిపేరే జారా శతావరి.
  • కోలముఖం, సోగకళ్ల అందంతో అచ్చం నిజమైన అమ్మాయిలా ఆమె కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతోంది.
  • గతేడాది జూన్‌ నుంచి పీఎంహెచ్‌ బయోకేర్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా జారా శతావరి వ్యవహరిస్తున్నారు.
  • ఈమె ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాకు 7500 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
  • కంటెంట్‌ డెవలప్‌మెంట్‌, డేటా అనాలసిస్‌, బ్రాండ్‌ అవేర్‌నెస్‌, క్రియేటివ్‌ ఐడియేషన్‌, హెల్త్‌-వెల్‌నెస్‌ కన్సల్టింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌, ఫ్యాషన్‌ స్టైలింగ్‌ ఇలా 13 విభాగాల్లో జారాకు నైపుణ్యం ఉందని రాహుల్ చౌదరి చెబుతున్నారు.

Also Read : Yamaha Nmax Turbo: టర్బో ఇంజన్‌తో కొత్త స్కూటర్‌.. భారత్‌లో లాంచ్ అవుతుందా..?