WhatsApp New Feature: ప్రస్తుతం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఇది తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈక్రమంలోనే మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. దీనివల్ల యూజర్ల ప్రైవసీకి అదనపు రక్షణ లభిస్తుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?
ప్రైవసీ సెట్టింగ్స్ విభాగంలో..
మనం నిత్యం వాట్సాప్‌లో ఎంతోమందికి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను(WhatsApp New Feature) పంపుతుంటాం. ఎంతోమంది నుంచి మనకు కూడా అవి అందుతుంటాయి. మనం పంపే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను అవతలి వారు ఇప్పటివరకు సేవ్ చేసుకోగలిగేవారు. అయితే ఇకపై ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే.. మనం పంపే ఫైళ్లను రిసీవ్ చేసుకున్న వారు, వాటిని సేవ్ చేసుకోకుండా నియంత్రించే ఫీచర్ త్వరలోనే వాట్సాప్‌లో మన ముందుకు రాబోతోంది. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఆప్షన్ వాట్సాప్‌లోని ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఆన్ చేసుకున్నప్పుడు, అవతలి వ్యక్తులు మన నుంచి పొందే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను సేవ్ చేసుకోవడం కుదరదు. వాళ్లు మన ఫైళ్లను సేవ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ‘సేవ్ చేయడం కుదరదు’ అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.
ఆ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకుంటేనే..
మనం ఈ కొత్త ఆప్షన్‌ను ఆఫ్ చేసుకుంటే.. మనం పంపే ఫైళ్లను అవతలి వారు సేవ్ చేసుకోగలుగుతారు. దీనివల్ల ఇతరులు మన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే స్క్రీన్ షాట్ ద్వారా ఈ సమాచారాన్ని కొంతమేర తస్కరించే వీలు ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సైతం వాట్సాప్ ఏదైనా విరుగుడును తయారు చేయాలని వాట్సాప్ యూజర్లు కోరుతున్నారు.ఈ కొత్త ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని.. బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ అయిన యూజర్లకు సైతం ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిసింది.
Also Read :New BJP Chief: రామ్ మాధవ్‌కు బీజేపీ చీఫ్ పదవి ? కారణాలు బలమైనవే !
అడ్వాన్స్ ఛాట్ ప్రైవసీ
ఎక్స్‌పోర్ట్ ఛాట్ హిస్టరీ విషయంలోనూ వాట్సాప్ యూజర్లకు మరో ప్రైవసీ ఫీచర్‌ను వాట్సాప్ అందించబోతోంది. అడ్వాన్స్ ఛాట్ ప్రైవసీని ఆన్ చేసుకుంటే, అవతలి వ్యక్తులు ఆ మెసేజ్‌లను ఎక్స్‌పోర్ట్ చేయలేరు.
వన్‌టైమ్ సెండ్ ఆప్షన్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌టైమ్ సెండ్ ఆప్షన్ ద్వారా కూడా ఈవిధంగా చేయొచ్చు. అయితే ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నాక.. మనం పంపే ఫైళ్లను అవతలి వారు ఒకసారి మాత్రమే చూడగలరు.
డిసప్పియరింగ్ ఫీచర్
ప్రస్తుతం డిసప్పియరింగ్ ఫీచర్ ద్వారా నిర్ణీత సమయం దాటిన తర్వాత మెసేజ్‌లు, ఛాట్‌లు తొలగిపోయేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.