Advanced Chat Privacy: భారతీయులంతా ఎంతో ఇష్టపడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌటూ అక్కర్లేదు. వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో తమ యూజర్లకు అత్యంత సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని అందిస్తోంది. అంతేకాదు.. యూజర్ల ప్రైవసీకి కూడా వాట్సాప్ పెద్దపీట వేస్తోంది. ఈక్రమంలో మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. అదే.. ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్.
Also Read :BRS Party : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ?
కొత్త ఫీచర్‌తో ఎన్నో ప్రయోజనాలు
- వాట్సాప్‌లో(Advanced Chat Privacy) మనం రకరకాల ఛాట్స్ చేస్తుంటాం. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు ఇలా వివిధ రకాల వారితో మనకు వాట్సాప్ ఛాటింగ్ నడుస్తుంటుంది.
- మనతో చేసిన వాట్సాప్ ఛాట్‌ను అవతలి వ్యక్తి సేవ్ చేసుకోవద్దు అని భావిస్తే.. ఇక నుంచి ఈజీగా అడ్డుకోవచ్చు.
- మనం ఎవరితోనైతే ఛాట్ చేశామో.. ఆ ఛాట్ పేరుపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. నోటిఫికేషన్స్, మీడియా విజిబులిటీ, ఎన్‌క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఛాట్ లాక్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఛాట్ లాక్ అనే ఆప్షన్ కిందే మనకు ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ (Advanced Chat Privacy) ఆప్షన్ మనకు కనిపిస్తుంది.
- ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ‘ఆన్’ చేయాలి. ఆ తర్వాతి నుంచి మీ మీడియాను అవతలి వ్యక్తులు సేవ్ చేయలేరు. ఎక్స్‌పోర్ట్ చేయలేరు. ఒకవేళ మీ వాట్సాప్ ఛాట్‌ను ఎవరైనా ఎక్స్‌పోర్ట్ చేద్దామని ప్రయత్నించినా ‘కెనాట్ ఎక్స్‌పోర్ట్ ఛాట్’ అనే సందేశం డిస్‌ప్లే అవుతుంది.
- ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకున్నాక.. మీ వ్యక్తిగత ఛాట్‌ను అవతలి వారు డౌన్‌లోడ్ చేసుకోలేరు. మన ఛాట్ ఇతరులకు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాదు. అంటే మీరు పంపించే ఛాట్‌ను వేరే గ్రూప్‌నకు పంపించడం మినహా, వాట్సాప్‌ను దాటి వేరే సోషల్ మీడియాలలో షేర్ చేయడం కుదరదు.
Also Read :Shimla Agreement : ‘సిమ్లా ఒప్పందం’ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్.. ఏమిటిది ?
వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారా.. అయితే ఇది వాడుకోండి
మనం చాలా వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉంటాం. ఆయా గ్రూపుల్లో ఉండేవాళ్లంతా మన పరిచయస్తులు కాదు కదా. ఆయా వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఏదైనా సున్నితమైన అంశంపై గురించి ఛాట్ చేసినా.. అవతలి వ్యక్తులు దాన్ని దుర్వినియోగం చేసే ఛాన్స్ లేకుండా చేసేదే ఈ సరికొత్త ఫీచర్. అందుకే ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే బెటర్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ విభాగాల్లోని పలువురు యూజర్లకు ఈ సదుపాయాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్ అప్‌డేటెడ్‌గా ఉంటే ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చి ఉంటుంది. లేదంటే మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోండి.