X Vs Bluesky : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’కు షాక్ తగిలింది. లక్షలాది మంది యూజర్లు ఎక్స్ నుంచి వైదొలగడం ప్రారంభించారు. ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్‌కు కీలక పదవి దక్కనుండటం వల్లే యూజర్లు ఎక్స్‌కు గుడ్ బై చెబుతున్నారని తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఎక్స్‌లో ట్రంప్‌కు భజన చేసే అంశాలే ఎక్కువగా ట్రెండ్ అయ్యేలా ఎలాన్ మస్క్ చేస్తారనే అభిప్రాయానికి ఎక్స్ యూజర్లు వచ్చారు. అందుకే వాళ్లు ప్రత్యామ్నాయం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈక్రమంలో ఎక్స్‌ను వదిలేసిన చాలామంది ‘బ్లూ స్కై’ వైపు వెళ్లిపోతున్నారు. బ్లూ స్కై సోషల్ మీడియా యాప్ చూడటానికి అచ్చం ఎక్స్‌లాగే ఉంటుంది. దాని రంగు, లోగో సైతం ట్విట్టర్‌ను తలపిస్తాయి. గత కొన్ని రోజులుగా బ్లూ స్కైలో(X Vs Bluesky) ప్రతిరోజు సగటున దాదాపు 10 లక్షల మంది కొత్త యూజర్లు చేరుతున్నారట. ప్రస్తుతం మొత్తం 1.67 కోట్ల మంది యూజర్లు బ్లూ స్కైకు ఉన్నారు. ఈ పరిణామం ఎక్స్‌కు హడలు పుట్టిస్తోంది.
Also Read :Indian Artefacts : అమెరికా టు భారత్.. స్వదేశానికి 1,400 ప్రాచీన కళా ఖండాలు
ఏమిటీ బ్లూస్కై ?
- ట్విట్టర్ కంపెనీ మాజీ అధిపతి జాక్ డార్సీ.. బ్లూ స్కై సోషల్ మీడియా కంపెనీని ప్రారంభించారు. అయితే 2024 మే నెలలో ఆయన బ్లూ స్కై కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ కంపెనీకి సీఈఓగా జే గ్రాబెర్ వ్యవహరిస్తున్నారు.
- అచ్చం ట్విట్టర్ తరహా ఇంటర్ ఫేస్ ఉండటం బ్లూ స్కై ప్రత్యేకత.
- బ్లూ స్కై యూజర్లు తాము సొంతంగా వ్యక్తిగత డొమైన్లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- ఇటీవలే బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత మీడియా దిగ్గజం ‘ది గార్డియన్’ కూడా ఎక్స్ నుంచి వైదొలగింది. ఇకపై దాన్ని వినియోగించబోమని స్పష్టం చేసింది.
- ఈ పరిణామాలు బ్లూ స్కైకు ప్లస్ పాయింట్లు మారే అవకాశాలు ఉన్నాయి.
- లిజో, బెన్ స్టిల్లర్ జేమీ లీ కుర్టిస్, పాటాన్ ఓస్వాల్ట్ వంటి హాలీవుడ్ సెలిబ్రిటీలు ఇప్పటికే బ్లూ స్కైలో చేరారు.
Also Read :Rivers Inter Linking : గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం.. ఏపీకి ప్రయోజనమిదీ
- బ్లూస్కై కంపెనీ ఏర్పాటు చేసిన కొత్తలో ఇన్వెస్టర్ల నుంచి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి నిధులను సేకరించారు.
- ఇప్పుడు యూజర్లకు కస్టమ్ డొమైన్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంటే యూజర్లు బ్లూ స్కైలో వారి వ్యక్తిగత పేర్లతో పేజీలను క్రియేట్ చేసుకోవచ్చు.
- అయినప్పటికీ ఎక్స్ కంపెనీకి బ్లూ స్కై చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం ఎక్స్‌లో రోజువారీగా దాదాపు 25 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటారు.