Meta AI App : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఛాట్‌బోట్‌ల విభాగంలో అమెరికా కంపెనీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. ఇప్పటికే అమెరికా కంపెనీ ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన ఛాట్ జీపీటీ మంచి క్రేజ్‌ను అందుకుంది. తాజాగా ఇప్పుడు మెటా (ఫేస్‌బుక్) కంపెనీ నుంచి కూడా ప్రత్యేక ఏఐ ఛాట్‌బోట్ యాప్ ‘మెటా ఏఐ’ వచ్చేసింది. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..
Also Read :Taj Mahal Camouflage : భారత్ – పాక్ ఘర్షణ.. తాజ్‌మహల్‌పై ‘గ్రీన్ కాముఫ్లేజ్’.. ఎందుకు ?
మెటా ఏఐ యాప్ గురించి..
- మెటా ఏఐ (Meta AI App) యాప్‌లో పలు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
- లామా 4 లాంగ్వేజ్ మోడల్‌తో ఈ యాప్‌ను రూపొందించారు.
- ఈ యాప్‌లో ఏఐ ఛాట్‌బోట్‌తో మాట్లాడటం చాలా ఈజీ.
- ఇది ఎటువంటి ప్రశ్నలకైనా సునాయాసంగా సమాధానం చెప్పగలదు.
- ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక మెటా ఏఐ యాప్‌ను తెచ్చామని మెటా కంపెనీ ప్రకటించింది.
- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకూ ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.
- మెటా ఏఐ వాయిస్ ఫీచర్ సాయంతో మనం ఛాట్‌బోట్‌తో సంభాషిస్తూనే.. డివైజ్‌లో ఇతర యాప్‌లను కూడా వాడొచ్చు.
- మైక్రోఫోన్ ఆన్‌లో ఉందని తెలియజేసేందుకు.. ఈయాప్‌లోని స్క్రీన్‌పై ఒక ఐకాన్ ఉంటుంది.
- ఈ యాప్‌లో ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లు సైతం ఉంటాయి. దీనికోసం టెక్ట్స్ లేదా వాయిస్ ఏ రూపంలోనైనా మనం ప్రాంప్ట్‌ను అందించొచ్చు.
- ఫుల్- డ్యూప్లెక్స్ స్పీచ్ టెక్నాలజీతో రూపొందించిన వాయిస్ డెమోను కూడా మెటా పరిచయం చేసింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు నేరుగా వాయిస్ రూపంలో అందిస్తుంది.
- ప్రస్తుతం వాయిస్ డెమో సేవలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- మెటా తన ఏఐ పవర్డ్ రే- బాన్ స్మార్ట్ గ్లాసెస్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
- మెటా కంపెనీ తన ఏఐ వెబ్ వెర్షన్‌కు కూడా అదనపు ఫీచర్లను జోడిస్తోంది.