Storm Control Tech: పిడుగుపాటు వల్ల ఏటా వర్షాకాలంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. మన భారతదేశంతో పాటు చాలాదేశాల్లోనూ ఈ తరహా ఘటనలు జరుగుతుంటాయి. అయితే అత్యాధునిక సాంకేతికతతో పిడుగుపాటును అడ్డుకునే తొలి ప్రయత్నం మాత్రం జపాన్ దేశం చేసింది. అదెలాగో తెలుసుకుందాం..
Also Read :130 Nukes Warning: భారత్‌పై దాడికి 130 అణు బాంబులు: పాక్ మంత్రి
జపాన్ సైంటిస్టుల గొప్ప సంకల్పం
పిడుగు పాటును కంట్రోల్ చేయడం అసాధ్యం అని మనమంతా భావించేవాళ్లం. దాన్ని చూసి భయపడిపోయే వాళ్లం. పిడుగు అనేది నేచర్ పవర్ ఆధీనంలో ఉండే అంశమని చెప్పుకునే వాళ్లం. అయితే జపాన్‌కు చెందిన నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ సైంటిస్టులు ఇందుకు భిన్నంగా ఆలోచించారు. పిడుగుపాటుతో జరుగుతున్న ప్రాణనష్టాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే సంకల్పానికి వచ్చారు. పిడుగుపాటు ఘటనల వల్ల జపాన్‌కు ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఈ నష్టాన్ని తగ్గించడంతో పాటు ప్రజా భద్రతకు పెద్ద పీట వేయాలని భావించారు.
Also Read :POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్
పిడుగులను ఎలా కంట్రోల్ చేస్తారు?
ఇందుకోసం ప్రపంచంలోనే తొలి స్టార్మ్ కంట్రోల్ డ్రోన్ టెక్నాలజీని(Storm Control Tech) తీర్చిదిద్దారు. ఇది పిడుగులను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తుంది. ఇందులో భాగంగా ఒక డ్రోన్‌ని ఎగిరేసి మేఘాల్లోకి పంపుతారు. అది మేఘాల్లోకి వెళ్లిన తర్వాత ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్‌ని డిటెక్ట్ చేసింది. ఆ తర్వాత డ్రోన్‌లో ఉన్న ఒక స్విచ్‌ను శాస్త్రవేత్తలు భూమి నుంచే యాక్టివేట్ చేస్తారు. తదుపరిగా మేఘాలలోని పిడుగును సదరు డ్రోన్ తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటుంది. పిడుగు దిశను మార్చి.. జనావాసాలు లేని ప్రదేశం వైపుగా లాక్కెళ్లి పారవేస్తుంది. ఈ టెక్నాలజీని రెండు నెలల పాటు నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ పరీక్షించింది. 2024 డిసెంబర్లో హమద నగరంలో ఈ టెక్నాలజీని టెస్ట్ చేశారు. ఈ టెక్నాలజీలో భాగంగా వినియోగించే డ్రోన్ చాలా స్పెషల్. దీన్ని ఒక ప్రత్యేక లోహంతో తయారు చేశారు. ప్రత్యేక రక్షణ కల్పించే బోనులో ఈ డ్రోన్ ఉంటుంది. ఈ బోను ఎంత పవర్ ఫుల్ అంటే.. అది మెరుపులను కూడా తట్టుకోగలదు. ఈ డ్రోన్లోని కొన్ని సున్నితమైన ప్రాంతాలకు మాత్రమే మెరుపు చేరుకోగలదు. పిడుగుపాటు ఘటనల నుంచి జపాన్‌లోని నగరాలు, భారీ భవనాలు, ఫ్యాక్టరీలు, ఇతర మౌలికవసతులను రక్షించేందుకు ఈ తరహా డ్రోన్ టెక్నాలజీని రూపొందించారు.