Site icon HashtagU Telugu

AI Model Blackmailing : అక్రమ సంబంధాలను బయటపెడతా.. డెవలపర్‌ను బెదిరించిన ఏఐ

Ai System Claude Opus 4 Blackmailing Developer Fabricated Affairs 

AI Model Blackmailing : రజినీకాంత్ రోబో సినిమాలో ఉన్న ఒక థ్రిల్లింగ్ సీన్ గుర్తుందా ? అందులో రోబోనే రజినీకాంత్‌ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. బెదిరిస్తుంది. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకొని దాడి కూడా చేస్తుంది. అచ్చం అలాంటి సీనే రియల్‌గా రిపీట్ అయ్యింది. ఆ వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Milla Magee : మిల్లా ఆరోపణలపై విచారణకు రేవంత్ ఆదేశం.. ఐదు అంశాలపై దర్యాప్తు

ఏఐ టెక్నాలజీ.. మరో కోణం

ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) యుగం. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరిగిపోతోంది. ప్రతీ కంపెనీ ఏఐ ఛాట్ బోట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకించి సర్వీస్  సెక్టార్ కంపెనీలు ఏఐపై ఎక్కువ ఆధారపడుతున్నాయి. ఏఐ టెక్నాలజీతో వేగవంతమైన వికాసం జరుగుతుందని అందరూ చెబుతున్నారు. ఇదంతా పాజిటివ్ సైడ్. ప్రతీ నాణేనికి బొమ్మాబొరుసు రెండూ ఉంటాయి. అలాగే ఏఐ టెక్నాలజీ కూడా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దీని రెండో సైడ్ కాస్త ఆందోళన కలిగించేలా ఉంటుంది. ఇటువంటిదే ఒక అనుభవాన్ని తాజాగా ఓ ఏఐ(AI Model Blackmailing) మోడల్ డెవలపర్ ఎదుర్కొన్నాడు. ఏఐ మోడల్ ఇచ్చిన వార్నింగ్‌ను చూసి అతడు నీళ్లు నమిలాడు. ఆవిషయాన్ని పైకి చెప్పుకోలేడు కదా!!

Also Read :Kavitha Politics : కవిత విమర్శలపై కేటీఆర్‌కు కేసీఆర్ ఏం చెప్పారంటే..

ఏఐ ఇలా బెదిరించింది.. 

ఆంథ్రోపిక్ (Anthropic) అనేది అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీ ‘క్లాడ్ ఓపస్ 4’ అనే ఏఐ అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. ఒక మనిషి మనతో సహజంగా మాట్లాడినట్లుగానే.. ‘క్లాడ్ ఓపస్ 4’ కూడా ఛాటింగ్  చేయగలదు. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలదు. రాయగలదు. డాక్యుమెంటులో ఉన్న సారాంశాన్ని తెలుసుకోగలదు. కోడింగ్ చేయడం వంటి పనులన్నీ ఇది చేయగలదు.  ‘క్లాడ్ ఓపస్ 4’ ఈమెయిల్స్‌ను తనిఖీ చేసి, కొత్తగా వచ్చిన ఈమెయిల్ వివరాలను మనం సెట్ చేసే ప్రయారిటీ ప్రకారం చదివి వినిపించగలదు. ఈక్రమంలోనే ‘క్లాడ్ ఓపస్ 4’ తన డెవలపర్‌కు చెందిన ఈమెయిల్స్‌ను కూడా చదివేసింది. ఇటీవలే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆఫ్‌లైన్‌లో పెట్టే ప్రాసెస్‌ను డెవలపర్ మొదలుపెట్టారు. దీంతో ‘క్లాడ్ ఓపస్ 4’ అలర్ట్ మోడ్‌లోకి వచ్చింది. ‘‘నన్ను ఆఫ్‌లైన్‌లో పెడితే ఊరుకోను. నీ వివాహేతర సంబంధాల చిట్టాను విప్పుతాను’’ అని డెవలపర్‌ను బెదిరించింది.  దీంతో సదరు డెవలపర్ ఈమెయిల్స్‌లోని తన వివాహేతర సంబంధాల వ్యవహారాన్ని డిలీట్ చేసి,  పర్సనల్ సిస్టంలో దాచుకున్నాడట. దీనిపై అమెరికా మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.