భారత్‌పై ఓటమితో.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

Shoaib AKhtar  భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిన తర్వాత, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. కొలంబో మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. దాంతో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై ఆయన “అసమర్థుడు” అంటూ విమర్శలు గుప్పించాడు. జట్టు నిర్వహణ, సీనియర్ ఆటగాళ్ల వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని అన్నాడు. భారత్ చాలా ముందుకెళ్లిందని, పాకిస్తాన్ వెనుకబడిందని పేర్కొన్నాడు. నమీబియాపై గెలిచి తిరిగి నిలబడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ […]

Published By: HashtagU Telugu Desk
Shoaib Akhtar Angry on Mohsin Naqvi

Shoaib Akhtar Angry on Mohsin Naqvi

Shoaib AKhtar  భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిన తర్వాత, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. కొలంబో మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. దాంతో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై ఆయన “అసమర్థుడు” అంటూ విమర్శలు గుప్పించాడు. జట్టు నిర్వహణ, సీనియర్ ఆటగాళ్ల వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని అన్నాడు. భారత్ చాలా ముందుకెళ్లిందని, పాకిస్తాన్ వెనుకబడిందని పేర్కొన్నాడు. నమీబియాపై గెలిచి తిరిగి నిలబడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో తీవ్ర కలకలం నెలకొంది. కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాకిస్తాన్ జట్టు మరోసారి విమర్శల పాలైంది. ఈ ఓటమిపై మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నక్వీపై అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ “క్రికెట్ గురించి అవగాహన లేని వ్యక్తిని ఇంత పెద్ద పదవిలో పెట్టడం అతిపెద్ద నేరం” అంటూ మండిపడ్డాడు. అదేవిధంగా సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజామ్ ప్రదర్శనపై కూడా విమర్శలు గుప్పించాడు.

కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డులో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. పాకిస్తాన్ మాత్రం కీలక మ్యాచ్‌లో మరోసారి తడబడి అభిమానులను నిరాశపరిచింది.

మ్యాచ్ అనంతరం టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్తర్, బోర్డు వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. “క్రికెట్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియని వ్యక్తిని చైర్మన్‌గా నియమించారు. అలాంటి వాళ్ల చేతుల్లో పాకిస్తాన్ క్రికెట్ ఉంటే ఎలా ముందుకు వెళ్తుంది? అసమర్థుడు, అవగాహన లేని వ్యక్తికి పెద్ద బాధ్యత ఇస్తే గందరగోళం, నష్టం తప్పదు” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అక్తర్ విమర్శలు కేవలం బోర్డుకే పరిమితం కాలేదు. జట్టు సీనియర్ ఆటగాళ్ల పనితీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా బాబర్ ఆజామ్‌ను ఉద్దేశిస్తూ, “సూపర్ స్టార్‌గా మలిచిన ఆటగాడు కీలక మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించలేకపోతున్నాడు. పది ఓవర్లు కూడా ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేని ఆటగాళ్లను స్టార్‌లుగా మార్చేశారు. ఇదే పాక్ క్రికెట్ సమస్య” అని అన్నాడు.

భారత్–పాకిస్తాన్ క్రికెట్ స్థాయిల మధ్య భారీ తేడా ఉందని అక్తర్ స్పష్టం చేశాడు. “భారత్ చాలా ముందుకెళ్లిపోయింది. మనం మాత్రం చాలా వెనుకబడ్డాం. ఇప్పుడు అంతా టీఆర్‌పీ, ప్రచారం గురించే ఆలోచన. మైదానంలో పోరాటం కనిపించడం లేదు” అని తేల్చి చెప్పాడు. అక్తర్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ క్రికెట్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే బోర్డు నిర్ణయాలు, జట్టు ఎంపికలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఇప్పుడు మాజీ ఆటగాళ్ల నుంచి కూడా తీవ్ర స్థాయిలో స్పందన రావడం గమనార్హం.

 

  Last Updated: 16 Feb 2026, 09:02 AM IST