టీమిండియాలోకి వైభ‌వ్ సూర్య‌వంశీ?!

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Published By: HashtagU Telugu Desk
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టును కేవలం 12.1 ఓవర్లలోనే 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేలా చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత అతడిని వెంటనే భారత జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

టీం ఇండియా ఆడేందుకు అర్హత సాధించిన వైభవ్

ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం.. 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయకూడదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే మార్చి 27న వైభవ్ తన 15వ ఏట అడుగుపెట్టాడు. దీనితో అతను ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అర్హత సాధించాడు.

Also Read: ఐపీఎల్‌లో మలింగను వెనక్కి నెట్టిన జడేజా!

మైఖేల్ వాన్ ఏమన్నారంటే?

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ‘క్రిక్ బజ్’తో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ ప్రతిభను కొనియాడారు. బీసీసీఐకి కీలక సూచనలు చేస్తూ ఇలా అన్నారు. అతను భారత్ తరపున ఎప్పుడు అరంగేట్రం చేస్తాడు? మనం బహుశా తొందరపడుతున్నామని నాకు తెలుసు. ఇది కేవలం అతని మొదటి ఐపీఎల్ ఇన్నింగ్స్ మాత్రమే. కానీ మరికొన్ని నెలల్లో ఇంగ్లాండ్‌తో వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) సిరీస్ జరగనుంది. నేను భారత క్రికెట్ బోర్డు స్థానంలో ఉంటే కచ్చితంగా అతడిని ఆ పర్యటనకు ఎంపిక చేస్తాను అని పేర్కొన్నాడు.

జట్టుతో ప్రయాణించడం ముఖ్యం

వైభవ్ వెంటనే తుది జట్టులో ఆడకపోయినా భారత జట్టు వాతావరణంలో ఉండటం అతనికి ఎంతో మేలు చేస్తుందని వాన్ అభిప్రాయపడ్డారు. అతడిని జట్టులోకి తీసుకోండి. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడితే ఇంకా మంచిది. కనీసం జట్టుతో పాటు పర్యటనకు వెళ్లే అవకాశం ఇవ్వండి అని పేర్కొన్నాడు. 15 ఏళ్ల వయసులో అతనికి పర్యటనకు వెళ్లే అనుమతి ఉందా? అతడిని భారత జట్టుతో పాటు ఉంచి అక్కడి అనుభవాన్ని పొందేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. నేరుగా జట్టులోకి రాకపోయినా, టీం ఇండియా వాతావరణం ఎలా ఉంటుందో అతనికి తెలియాలని పేర్కొన్నాడు.

 

  Last Updated: 31 Mar 2026, 08:46 PM IST