Hardik Pandya Lover: భారత్- సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుతో పాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన కూడా నిరాశాజనకంగా సాగింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ హార్దిక్ విఫలమయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా అవుటైన సమయంలో అతని ప్రియురాలు మాహికా శర్మ చప్పట్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
మాహికా శర్మ చప్పట్లు.. వైరల్ వీడియో
ఈ మ్యాచ్‌లో భారత జట్టు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15వ ఓవర్ మొదటి బంతికి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగాడు. హార్దిక్ బ్యాటింగ్‌తో నిరాశపరచడమే కాకుండా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అవుట్ అవ్వగా.. మాహికా శర్మ చప్పట్లు కొడుతూ కనిపించారు. ఆ సమయంలో టీమ్ ఇండియా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆమె అలా స్పందించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
Also Read: బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు
seriously… what was mahieka sharma clapping for? i could have understand if hardik was out after playing a good knock but he got out on 18 off 17 balls. pic.twitter.com/jfTZGeGS39
— sigma (@desisigma) February 23, 2026
హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్‌లోనూ తేలిపోయారు. ఆయన 4 ఓవర్లలో ఏకంగా 45 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక బ్యాటింగ్‌లో 7వ నంబర్‌లో వచ్చి 17 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశారు. ఇలా రెండు విభాగాల్లోనూ ఆయన ఫ్లాప్ అయ్యారు.
76 పరుగుల తేడాతో గెలిచిన సౌత్ ఆఫ్రికా
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 187/7 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ 35 బంతుల్లో 63 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లో 63 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.
