RCB vs PBKS Prediction: సొంతగడ్డపై ఆర్సీబీ సత్తా చాటుతుందా? పంజాబ్ దే పైచేయి

ఐపీఎల్ ఆరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ పంజాబ్ పై గెలిచి సత్తా చాటాలని ఆశపడుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది

RCB vs PBKS Prediction: ఐపీఎల్ ఆరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ పంజాబ్ పై గెలిచి సత్తా చాటాలని ఆశపడుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అయితే తొలి రౌండ్ మ్యాచ్ లు పూర్తయిన తర్వాత ఆర్సీబీ 9, పంజాబ్ కింగ్స్ మూడోస్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య జరిగే పోరు ఫ్యాన్స్ కి కిక్కిస్తుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 31 సార్లు తలపడగా అందులో పంజాబ్ కింగ్స్ 17 సార్లు గెలిచింది. ఆర్సీబీ 14 మ్యాచ్‌లు గెలిచింది. మరి సొంతగడ్డపై ఆర్సీబీ పంజాబ్ ని ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ vs కోహ్లీలా చూడొచ్చు. ఎందుకంటే అర్ష్‌దీప్ సింగ్ పై విరాట్ కోహ్లికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్లో ఒక్కసారి కూడా కోహ్లిని అర్ష్‌దీప్ ఔట్ చేయలేదు. కోహ్లి అర్ష్‌దీప్ బౌలింగ్ లో 23 బంతుల్లోనే 44 పరుగులతో భారీ ఇన్నింగ్స్ కు తెరలేపాడు. అయితే హర్‌ప్రీత్ బ్రార్ మాత్రం కోహ్లిని రెండుసార్లు, మ్యాక్స్‌వెల్ ను మూడుసార్లు ఔట్ చేశాడు.అంతేకాదు ఆర్సీబీపై కగిసో రబాడా చెలరేగుతాడు. రబడా డుప్లెస్సిని 2సార్లు, కోహ్లిని 3 సార్లు, మ్యాక్స్‌వెల్ ను రెండుసార్లు, దినేష్ కార్తీక్ ని మూడుసార్లు ఔట్ చేశాడు.

జాబ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో నుంచి ఆర్సీబీకి ముప్పు ఉండొచ్చు .ఐపీఎల్ లో ఈ స్టార్ బ్యాటర్ కి 200కుపైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఇవన్నీ ఆర్సీబీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.పిచ్ పరిస్థితి చూసినట్లతే చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామం. ఈ పిచ్ పై భారీ స్కోర్ కు స్కోప్ ఉంది. ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోర్ చేసేందుకు స్కోప్ ఉంది. ఈ పిచ్ లో తొలి బ్యాటింగ్ జట్టు 200కు పైగా పరుగులు రాబట్టగలదు.

Also Read: Samantha : పుష్ప 2లో సమంత కానీ అందుకు కాదా.. సుకుమార్ ప్లాన్ ఏంటో..?