Messi: మెస్సీ ధరించిన స్పెషల్ డ్రెస్ ఏంటో తెలుసా ?

నాలుగు వారాలుగా అభిమానులను అలరించిన సాకర్ ప్రపంచకప్ కు తెరపడింది.

  • Written By:
  • Updated On - December 19, 2022 / 02:21 PM IST

నాలుగు వారాలుగా అభిమానులను అలరించిన సాకర్ ప్రపంచకప్ కు తెరపడింది. ఖతార్ వేదికగా జరిగిన మెగా టోర్నీలో టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనా విజేతగా నిలిచింది. అద్భుతమైన ఆతిథ్యంతో ఖతార్ అందరి ప్రశంసలూ అందుకుంది. ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య పోరు అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది. పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా ఫ్రాన్స్ ను ఓడించి ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. కాగా సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వరల్డ్ కప్ ను అందుకున్న మెస్సీ బావోద్వేగానికి గురయ్యాడు.

ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రధానోత్సవంలో మెస్సీ వేసుకున్న స్పెషల్ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. మెస్సీ ధరించిన ఈ వస్త్రం ప్రత్యేకత ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు. అరబ్ దేశంలో దీనిని బిస్ట్ అని పిలుస్తారు. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో రాయల్టీకి గుర్తుగా దీనిని ధరిస్తారు. పలు సందర్భాల్లో ఖతార్ మతపెద్దలు దీనిని వేసుకుంటారు. దీనిని ఒంటె వెంట్రుకలు, మేక ఉన్నితో చాలా ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఖతార్ ఐకానిక్ డ్రెస్ గా పిలుస్తారు. ఫైనల్లో ట్రోఫీ అందజేసేందుకు వచ్చిన ఖతార్ దేశం ప్రముఖులు మెస్సీని దీనిని ధరించేలా రిక్వెస్ట్ చేశారు. దీనిని చిరునవ్వుతో అంగీకరించిన మెస్సీ తన జెర్సీపైన ధరించి ట్రోఫీని అందుకున్నాడు.