జస్ట్ గ్యాప్ ఇచ్చాడు అంతే.. మిగతాదంతా సేమ్ టూ సేమ్.. ఇప్పుడు కోహ్లీ గురించి ఫాన్స్ చెబుతున్న మాట ఇదే. మూడేళ్లుగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ ఒక దశలో టీమ్ ప్లేస్ కూడా ప్రశ్నార్థకంగా మారిన వేళ కొన్నాళ్ళు ఆటకు కూడా విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే మళ్ళీ ఫ్రెష్ గా మైదానంలోకి అడుగుపెట్టిన విరాట్ ఆసియా కప్ తో ఫామ్ అందుకున్నాడు. అయినా కూడా ప్రపంచ కప్ కు ముందు ఎన్నో డౌట్స్.. కోహ్లీ జోరు కొనసాగేనా అని.. అందరి అనుమానాలూ పాక్ తో మ్యాచ్ తోనే పటాపంచలు చేశాడు.
పాక్ తో మ్యాచ్ లో కోహ్లీ షాట్లు చూసి ఫాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఎన్నాళ్లో అయింది కోహ్లీ బ్యాట్ నుంచీ ఆ షాట్లు చూసి.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పైనా కోహ్లీ జోరు కొనసాగింది. పరుగుల దాహం ఏ మాత్రం తీరని కోహ్లీ మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో కొన్ని రికార్డులు కూడా ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read: India T20: నెదర్లాండ్స్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ
అలాగే రెండేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి మళ్లీ 1000 పరుగుల మైలురాయిని దాటాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 44 బంతుల్లో 62 పరుగులు చేశాడు. తాజా స్కోర్ తోఈ క్యాలెండర్ ఇయర్‌లో కోహ్లీ మొత్తం 1024 పరుగులు చేయగా.. ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019లో 1000 పరుగుల మార్క్ దాటిన కోహ్లీ.. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ ఘనత సాధించాడు.
ప్రస్తుతం సెమీస్ రేసులో ముందున్న టీమిండియాకు కోహ్లీ ఫామ్ ఫుల్ అడ్వాంటేజ్. తర్వాతి మ్యాచ్ లో భారత్ సౌతాఫ్రికాతో తలపడనుంది. సఫారీ జట్టుపై కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉండడంతో సాగాలి విరాట పర్వం ఇలానే అనుకుంటున్నారు ఫాన్స్. ఇప్పటికే తన బ్యాట్ తో విమర్శకుల నోళ్ళు మూయించిన కోహ్లీ ఇక వరల్డ్ కప్ ను గెలిపిస్తే అభిమానులకు అంతకంటే కిక్కు ఇంకేమీ ఉండదు.
Also Read: T20 : పాకిస్తాన్ కు షాకిచ్చిన జింబాబ్వే…1 పరుగు తేడాతో పాకిస్తాన్ పై విజయం..!!