Varun Chakravarthy: దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియాకు ఎదురైన ఓటమి కళ్లు తెరిపించేలా చేసింది. 2024 ఫైనల్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఆఫ్రికా జట్టు భారత్‌ను 76 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. అంతకుముందు భారత బౌలర్లు కూడా మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అయితే బౌలింగ్ పరంగా జట్టు నిరాశపరిచినప్పటికీ టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక వికెట్ పడగొట్టడం ద్వారా ఆయన అర్ష్‌దీప్ సింగ్ రికార్డును బద్దలు కొట్టి అరుదైన ఘనత సాధించాడు.
వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ వికెట్ పడగొట్టిన ఆయన, మొత్తం 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ఈ ఒక్క వికెట్‌తో చక్రవర్తి భారత్ తరపున అత్యధిక వరుస మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read: వైభవంగా విరోష్ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!
వరుణ్ చక్రవర్తి భారత్ తరపున ఆడిన గత 18 వరుస మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు అర్ష్‌దీప్ సింగ్ పేరిట ఉండేది. ఆయన 2024-25 మధ్య వరుసగా 17 మ్యాచ్‌ల్లో వికెట్లు తీశారు.
టీ20 ప్రపంచకప్‌లో వరుణ్ ప్రదర్శన
ఈ టీ20 ప్రపంచకప్‌లో వరుణ్ చక్రవర్తి టీమ్ ఇండియా తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆయన 5 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఎకానమీ రేటు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటిక అంతకుముందు మ్యాచ్‌ల్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. వరుణ్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 41 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు సాధించాడు.
