టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్‌కు దిగగా రెండో ఓవర్‌లోనే విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ వికెట్‌ను కోల్పోయింది.

Published By: HashtagU Telugu Desk
Team India

Team India

Team India: 2026 టీ20 వరల్డ్ కప్ మొదటి రోజు అత్యంత అనూహ్యంగా ప్రారంభమైంది. రోజులో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు విజయం సాధించలేకపోయినా ఒకానొక దశలో పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లకు చెమటలు పట్టించాయి. ఇప్పుడు అదే పనిని యూఎస్ఏ కూడా చేసింది. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో యూఎస్ఏ బౌలర్లు భారత బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్‌కు దిగగా రెండో ఓవర్‌లోనే విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. అభిషేక్ కనీసం ఖాతా తెరవకుండానే తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి సగం టీమిండియా పెవిలియన్‌కు చేరుకుంది.

Also Read: సామూహిక స‌మ్మెకు పిలుపునిచ్చిన డ్రైవ‌ర్లు.. కార‌ణ‌మిదే?!

టీమిండియా పరిస్థితి దారుణం

ముఖ్యంగా కుడిచేతి వాటం వేగవంతమైన బౌలర్ షెడ్లీ వాన్ షాల్క్‌విక్ భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అభిషేక్ శర్మ సున్నా పరుగులకే అవుట్ కాగా, సంజూ శాంస‌న్‌ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతను 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తిలక్ వర్మ 25 పరుగులు చేసినప్పటికీ శివమ్ దూబే, రింకూ సింగ్ నుండి ఆశించిన స్థాయిలో మెరుపులు రాలేదు.

5 బంతులు, ఒక పరుగు- మూడు వికెట్లు

ఇవి షెడ్లీ వాన్ షాల్క్‌విక్ వేసిన ఆ ఓవర్ గణాంకాలు. ఆ ఓవర్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి ముగ్గురు కీలక భారత బ్యాటర్లు తమ వికెట్లను కోల్పోయారు. ఆరో ఓవర్ మూడో బంతికి ఇషాన్ (20) అవుట్ అవ్వగా, ఆ ఓవర్ ముగిసే సమయానికి తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి 46 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో జరిగిన టీ20 మ్యాచ్‌లలో పవర్‌ప్లేలో టీమిండియా నమోదు చేసిన మూడవ అత్యల్ప స్కోరు ఇది.

  Last Updated: 07 Feb 2026, 09:46 PM IST