టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

ప్రస్తుతం టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ పేసర్ మోర్నీ మోర్కెల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు స్పెషలిస్ట్ కోచింగ్ కన్సల్టెంట్‌గా ఆయన సొంత అన్న ఆల్బీ మోర్కెల్ పనిచేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
IND vs SA

IND vs SA

IND vs SA Match: టీమ్ ఇండియా తన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 ప్రయాణాన్ని ఫిబ్రవరి 22 నుండి ప్రారంభించనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ తొలి మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గత ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తుండగా ఈ మ్యాచ్ ఒక అరుదైన సోదరుల యుద్ధానికి వేదిక కానుంది.

మైదానంలో ఇద్దరు అన్నదమ్ముల సవాల్

ప్రస్తుతం టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ పేసర్ మోర్నీ మోర్కెల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు స్పెషలిస్ట్ కోచింగ్ కన్సల్టెంట్‌గా ఆయన సొంత అన్న ఆల్బీ మోర్కెల్ పనిచేస్తున్నారు.

Also Read: తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

ఆల్బీ మోర్కెల్: పెద్దన్న (దక్షిణాఫ్రికా కోచింగ్ స్టాఫ్)

మోర్నీ మోర్కెల్: తమ్ముడు (భారత బౌలింగ్ కోచ్)

వీరిద్దరూ ఒకప్పుడు దక్షిణాఫ్రికా తరఫున కలిసి ఆడి ఎన్నో విజయాలు అందించారు. ఐపీఎల్‌లో కూడా ఒకరికొకరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ పోరు గురించి ఆల్బీ మోర్కెల్ సరదాగా స్పందిస్తూ.. “మా కంటే మా అమ్మే ఎక్కువ టెన్షన్‌లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆమెకు ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కావడం లేదు. భారత్‌కా లేక దక్షిణాఫ్రికాకా?” అని వ్యాఖ్యానించారు.

మోర్నీ మోర్కెల్ 2024 నుండి టీమ్ ఇండియా కోచింగ్ బృందంలో భాగంగా ఉంటూ భారత బౌలర్లను తీర్చిదిద్దుతున్నారు. అహ్మదాబాద్‌లో జరగబోయే ఈ పోరులో ఈ ఇద్దరు దిగ్గజ సోదరుల వ్యూహాలలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

  Last Updated: 18 Feb 2026, 10:00 PM IST