Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008 ఐపీఎల్ సీజన్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆ జట్టు ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. అయితే కొంతమంది యువ ఆటగాళ్ల కారణంగా ఈ ఫ్రాంచైజీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతోంది. అయితే లీగ్ ప్రారంభానికి కేవలం 3 రోజుల ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు అమ్ముడైపోయింది. ఒక అమెరికన్ వ్యాపారవేత్త ఈ జట్టును రూ. 15 వేల కోట్లకు పైగా భారీ ధరకు కొనుగోలు చేశారు.
రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!
మనోజ్ బదాలే రాజస్థాన్ రాయల్స్ జట్టులోని తన పూర్తి షేర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. నివేదికల ప్రకారం.. యూఎస్ వ్యాపారవేత్త, కన్సార్టియం కంపెనీ యజమాని కాల్ సోమాని ఫ్రాంచైజీలోని 100 శాతం షేర్లను రూ. 15,000 కోట్ల నుండి రూ. 15,300 కోట్ల మధ్య ధరకు తన సొంతం చేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2026 సీజన్ వరకు ఈ జట్టు మనోజ్ బదాలే పేరు మీదనే ఉంటుంది. ఈ డీల్ ప్రకారం.. ఐపీఎల్ 2027 నుండి జట్టు బాధ్యతలు కాల్ సోమాని చేతుల్లోకి వెళ్తాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ‘రెయిన్ గ్రూప్’ పర్యవేక్షణలో ఈ ఒప్పందం ఖరారైంది. రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసేందుకు చాలా కంపెనీలు పోటీ పడినప్పటికీ చివరకు కాల్ సోమాని ఈ డీల్‌ను దక్కించుకున్నారు.
Also Read: YCP : పార్లమెంట్ భవనంలో కూడా వైసీపీ నేతలకు అదే నెంబర్ !!
పెరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విలువ
ఐపీఎల్ మొదటి ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లుగా తేలింది. ఈ డీల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ కూడా భారీగా పెరిగింది. ఆర్‌సీబీ విలువ ఇప్పుడు 2 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ ఆర్‌సీబీని కొనుగోలు చేసే రేసులో ముందున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 సమయంలో ఆ ఒప్పందం కూడా ఖరారు కావచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ డీల్ గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
