Site icon HashtagU Telugu

She Is Male : ‘‘నువ్వు మహిళవేనా ? పురుషుడివా ?’’.. ఈ ప్రశ్నపై మహిళా బాక్సర్‌ సంచలన నిర్ణయం

Lin Yu Ting She Is Male Taiwan

She Is Male : లిన్ యూ టింగ్.. ఈమె తైవాన్‌కు చెందిన బాక్సర్. రెండు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ప్రతీసారి ఆమెను ఒక విషయం వెంటాడుతోంది. బాగా బాధపెడుతోంది.  లిన్ యూ టింగ్ ఏ పోటీలకు వెళ్లినా.. ‘‘నువ్వు మహిళవేనా ? పురుషుడివా ?’’ అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఆమెను చాలా కలచివేస్తోంది. తాను మహిళే అయినా ఇలాంటి ప్రశ్నలు అడగడం సరికాదని లిన్ యూ టింగ్ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల ఫైనల్స్‌లో లిన్ యూ టింగ్ పాల్గొనాల్సి ఉంది.

Also Read :Red Planet Day : నవంబర్ 28న రెడ్ ప్లానెట్ డేని ఎందుకు జరుపుకుంటారు? ఈ సంవత్సరం థీమ్ ఏమిటి?

అయితే ఈ పోటీల నిర్వాహకులు ఆమెను మళ్లీ అవే ప్రశ్నలు అడిగి బాధపెట్టారు. నువ్వు మహిళవేనా అని అడిగారు. దీంతో లిన్ యూ(She Is Male) తీవ్ర అసహనానికి గురైంది. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పడం ఇష్టం లేక పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్ పోటీల నిర్వాహకులు స్పందిస్తూ.. ‘‘మేం జెండర్ గురించి లిన్‌ను ఎక్కడా అడగలేదు. ఆమె అసలు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రాలేదు’’ అని వెల్లడించారు.

Also Read :Extramarital Affair : వివాహేతర సంబంధాలు నెరిపే వాళ్లకు ‘రేప్ కేసు’ వర్తించదు : సుప్రీంకోర్టు

గత సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో లింగ్ యూతో పాటు అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌పై అనర్హత వేటు పడింది. ఈ ఇద్దరిలో పురుషులకు సంబంధించిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని తేలడంతో అధికారులు వారిపై అనర్హత వేటు వేశారు. అంతేకాదు.. లిన్ యూ గెల్చుకున్న కాంస్య పతకాన్ని రద్దు చేశారు. పురుషులతో సమానమైన బాక్సింగ్ సామర్థ్యాలు ఉన్నాయనే ఆరోపణలను లిన్ యూ టింగ్ ఎదుర్కొంటున్నారు.

Also Read :Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం