టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

నవంబర్ 2025లో ఐసీసీ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడే ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఆ నాకౌట్ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా శ్రీలంకలోనే జరుగుతాయని స్పష్టమైంది.

Published By: HashtagU Telugu Desk
T20 World Cup Schedule

T20 World Cup Schedule

T20 World Cup Schedule: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో ఐసీసీ కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చి వరల్డ్ కప్ ఆడటం లేదు. కాబట్టి వారి మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతున్నాయి. అలాగే శ్రీలంక కూడా సహ-ఆతిథ్య దేశం కావడంతో ఆ జట్టు కూడా తన సొంత దేశంలోనే మ్యాచ్‌లు ఆడుతోంది.

నవంబర్ 2025లో ఐసీసీ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడే ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఆ నాకౌట్ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా శ్రీలంకలోనే జరుగుతాయని స్పష్టమైంది. ఇప్పుడు వచ్చిన కొత్త అప్‌డేట్ ప్రకారం.. ఒకవేళ శ్రీలంక క్వాలిఫై అయినా వారి మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా శ్రీలంకలోనే జరుగుతాయి.

Also Read: వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

షెడ్యూల్‌లో ప్రధాన మార్పులు

టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగాల్సి ఉంది. కానీ పాకిస్థాన్ లేదా శ్రీలంక క్వాలిఫై అయితే పరిస్థితి మారుతుంది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐసీసీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం మొదటి సెమీఫైనల్ వేదికను ఇంకా ఖరారు చేయలేదు. ఇది కోల్‌కతా లేదా కొలంబోలో జరిగే అవకాశం ఉంది.

ఐసీసీ తన ప్రకటనలో ఇలా పేర్కొంది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కోల్‌కతా లేదా కొలంబోలో జరుగుతుంది. ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే వారు మార్చి 4న కొలంబోలో ఆడతారు. ఒకవేళ పాకిస్థాన్ రేసు నుండి తప్పుకుని, శ్రీలంక అర్హత సాధిస్తే (మరియు వారి ప్రత్యర్థి భారత్ కానట్లయితే), శ్రీలంక తన సెమీఫైనల్‌ను కొలంబోలోనే ఆడుతుంది అని స‌మాచారం.

గ్రూప్ 1 పాయింట్ల పట్టిక

  • వెస్టిండీస్
  • సౌతాఫ్రికా
  • భారత్
  • జింబాబ్వే

గ్రూప్ 2 పాయింట్ల పట్టిక

  • ఇంగ్లాండ్
  • న్యూజీలాండ్
  • పాకిస్థాన్
  • శ్రీలంక
  Last Updated: 24 Feb 2026, 02:23 PM IST