Suryakumar Yadav: 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. సూర్య కూడా కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాకు అనేక కీలక మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించారు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026లో జెండా పాతేస్తోంది.
భారత్ తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా నాలుగో విజయంతో సూపర్-8లోకి ప్రవేశించింది. కాగా ఈ విజయంతో కెప్టెన్ సూర్య టీ20ఐ క్రికెట్‌లో ఒక భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఈ విషయంలో ఆయన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టారు.
టీ20ఐ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి సమాధానంగా నెదర్లాండ్స్ జట్టు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో సూర్యకుమార్ యాదవ్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యుత్తమ గెలుపు శాతం రికార్డును సాధించారు. సూర్య ఇప్పుడు 80.85% గెలుపు శాతంతో టీ20ఐ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. ఈ క్రమంలో ఆయన రోహిత్ శర్మ (80.65%)ను వెనక్కి నెట్టారు.
సూర్యకుమార్ ఇప్పటివరకు 47 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్సీ వహించగా, అందులో టీమ్ 38 మ్యాచ్‌లు గెలిచింది, కేవలం 7 మాత్రమే ఓడిపోయింది. అదే సమయంలో రోహిత్ కెప్టెన్సీలో భారత్ 62 మ్యాచ్‌లలో 50 గెలిచింది. ఇక ఎంఎస్ ధోనీ గెలుపు శాతం 58.33 కాగా, విరాట్ కోహ్లీది 64%గా ఉంది.
Also Read: 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి
టీ20 చరిత్రలో కెప్టెన్‌గా అత్యుత్తమ గెలుపు శాతం
- సూర్యకుమార్ యాదవ్- 80.85%
- రోహిత్ శర్మ- 80.65%
- అస్గర్ అఫ్గాన్- 80.39%
టీమ్ ఇండియా పేరిట కూడా వరల్డ్ రికార్డ్
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కు చేరుకుంది. నెదర్లాండ్స్‌పై సాధించిన విజయంతో టీమ్ ఇండియా పేరిట కూడా ఒక వరల్డ్ రికార్డ్ నమోదైంది. టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.
భారత జట్టు చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి భారత్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈసారి కూడా టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని డిఫెండ్ చేసుకుని చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
