Hyderabad vs Delhi: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలను నమోదు చేసింది. అదే ఊపును నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ టీమ్ కూడా గత మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది.
హెడ్ టూ హెడ్ రికార్డులు
- మొత్తం మ్యాచ్‌లు: 26
- SRH గెలిచినవి: 13
- DC గెలిచినవి: 12
- ఫలితం తేలనివి: 1
పిచ్ రిపోర్ట్
ఉప్పల్ స్టేడియం పిచ్ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఇది సాధారణంగా హై-స్కోరింగ్ మ్యాచ్‌లకు అనుకూలిస్తుంది. ఇక్కడ బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది. ఇది బ్యాటర్లకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. పవర్‌ప్లే సమయంలో బౌలర్లకు సవాలుగా ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ మరింత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఛేజింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
Also Read: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటన!
వాతావరణ నివేదిక
హైదరాబాద్‌లో సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య వర్షం పడే అవకాశం కేవలం 5 శాతం మాత్రమే ఉంది. కాబట్టి మ్యాచ్‌కు ఎటువంటి ఆటంకం కలగకపోవచ్చు. తొలి ఇన్నింగ్స్ సమయంలో ఉష్ణోగ్రత 33-34 డిగ్రీలు ఉండగా, రెండో ఇన్నింగ్స్ సమయంలో 29-30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్
- అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా (వికెట్ కీపర్), శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ.
ఢిల్లీ క్యాపిటల్స్
- పథుమ్ నిస్సంక, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఎకిబ్ నబీ, లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.
మ్యాచ్ వివరాలు
- మ్యాచ్ నంబర్: 31
- తేదీ: 21 ఏప్రిల్ (నేడు)
- సమయం: రాత్రి 7:30 గంటలకు
- వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్), హైదరాబాద్.
