Ishan Kishan: ఇలాగైతే ఇషాన్ కిషన్ కు కష్టమే : గవాస్కర్

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాడు.

  • Written By:
  • Updated On - April 26, 2022 / 12:11 AM IST

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లలో అర్ధ సెంచ‌రీలు సాధించిన ఇషాన్ కిష‌న్‌, త‌ర్వాత మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. . ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 199 పరగులు మాత్రమే సాధించాడు.

ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడుగా ఇషాన్ కిషన్ నిలిచాడు. మెగావేలంలో అతనికోసం ముంబై ఇండియన్స్‌ 15. 25 కోట్ల రూపాయలు వెచ్చించింది.. కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం ఇషాన్ కిషన్ కనబరచలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌ ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ మెగా వేలంలో ఇషాన్‌ ఇషాన్ కోసం అన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సింది కాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ప్రదర్శనపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. ఇషాన్ కిషన్ మానసిక స్థితి సరిగా లేదని నాకు అనిపిస్తోంది.

నిజానికి ఎవరికైనా బంతి ఎడ్జ్ తీసుకోని స్లిప్ లో క్యాచ్ పడితే ఆ బ్యాటర్ అది ఔటా కాదా అని తెలుసుకునేందుకు ఓపికగా వేచిచూస్తాడు కానీ లక్నోతో మ్యాచ్ లో ఇషాన్ కిషన్ దాన్ని నిర్దారించుకోకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. దీన్ని బట్టి అతని మానసిక పరిస్థితి, ఏం బాలేదని అనిపిస్తోందని గవాస్కర్ అన్నాడు. అలాగే షార్ట్ పిచ్ బంతులను ఇషాన్ కిషన్ సరిగ్గా ఎదుర్కోలేడు కాబట్టి ఈ ఏడాదిఆస్ట్రేలియాలో జరగబోయే టీ20ప్రపంచ‌కప్‌లో ఇషాన్ కిషన్ రాణించడం కష్టమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.