శ్రీలంక క్రికెటర్లు అరెస్ట్.. మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు..

శ్రీలంక క్రికెట్‌లో ఓ వివాదం కలకలం రేపింది. తాము బస చేసిన హోటల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై శ్రీలంక అండర్-19 పురుషుల టీమ్ కు చెందిన ఇద్దరు క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే… కొలంబోలోని నరహేన్‌పిటలో ఉన్న ఒక హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే హోటల్‌లో బస చేస్తున్న కొందరు మహిళలు, తాము బాత్రూమ్‌లో ఉండగా […]

Published By: HashtagU Telugu Desk
Sri Lanka U19 cricketers arrested

Sri Lanka U19 cricketers arrested

శ్రీలంక క్రికెట్‌లో ఓ వివాదం కలకలం రేపింది. తాము బస చేసిన హోటల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై శ్రీలంక అండర్-19 పురుషుల టీమ్ కు చెందిన ఇద్దరు క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

వివరాల్లోకి వెళితే… కొలంబోలోని నరహేన్‌పిటలో ఉన్న ఒక హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే హోటల్‌లో బస చేస్తున్న కొందరు మహిళలు, తాము బాత్రూమ్‌లో ఉండగా మొబైల్ ఫోన్లతో వీడియో తీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ వారం మొదట్లో పోలీసులు ఆ ఇద్దరు యువ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం వారిని అలుత్కడె మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికి 5 లక్షల శ్రీలంక రూపాయల (సుమారు రూ. 1.48 ల‌క్ష‌లు) వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. తీసిన వీడియోలను ఏవైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారా? అనే కోణంలో నరహేన్‌పిట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం మే 25న తిరిగి కోర్టుకు హాజరు కావాలని నిందితులను ఆదేశించారు.

  Last Updated: 01 May 2026, 09:34 AM IST