Riyan Parag: రాజస్థాన్ రాయల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో కారణంగా రియాన్ పెద్ద చిక్కుల్లో పడేలా కనిపిస్తున్నారు. ఇదే విషయంలో బీసీసీఐ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్
రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ జరుగుతున్న సమయంలో కెమెరా డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగింది. ఆ సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ కూర్చుని ఈ-సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు పరాగ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకారం!
Nahh man , Riyan parag captured Vaping on live television In dressing room
He is idolising Dhoni too much😭🙏 pic.twitter.com/4cWZUGH9QY— ` (@McgMadMan) April 28, 2026
బీసీసీఐ శిక్ష విధిస్తుందా?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఇది ఉల్లంఘన కిందకే వస్తుంది కాబట్టి బీసీసీఐ ఈ విషయంలో రియాన్ పరాగ్‌పై చర్యలు తీసుకోవచ్చు. ఐపీఎల్ ఆటగాళ్లు, అధికారుల ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.2 ప్రకారం ఆట ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఈ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
ఎలాంటి శిక్ష పడవచ్చు?
డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగినందుకు మ్యాచ్ రిఫరీ నుంచి రియాన్ పరాగ్‌కు హెచ్చరిక జారీ కావొచ్చు. దీనితో పాటు మ్యాచ్ ఫీజులో కొంత శాతం జరిమానా విధించవచ్చు లేదా మ్యాచ్ నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ఇప్పటి వరకు బోర్డు నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తలెత్తుతున్న తీవ్రమైన ప్రశ్నలు
మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం, డ్రెస్సింగ్ రూమ్ లోపల ధూమపానం చేయడం పూర్తిగా నిషిద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో రియాన్ పరాగ్ వేప్ తాగడం విమర్శలకు దారితీస్తోంది. అంతేకాకుండా భారతదేశంలో ఈ-సిగరెట్ తాగడం చట్టరిత్యా నేరం. దీనిని ఉల్లంఘిస్తే జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉంది.
బ్యాట్‌తో రాణించని కెప్టెన్
రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ పరాగ్ బ్యాట్ మాత్రం ఝళిపించడం లేదు. ఈ సీజన్‌లో పరాగ్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 14 సగటుతో 117 పరుగులు మాత్రమే చేశాడు.
