నా పేరుతో తప్పుడు స్టేట్‌మెంట్లు ప్రచారం చేయకండి: శిఖ‌ర్ ధావ‌న్‌

శిఖర్ ధావన్- ఆయేషా ముఖర్జీ అక్టోబర్ 2023లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో ధావన్, సోఫీ షైన్ అనే మహిళతో కలిసి కనిపించారు.

Published By: HashtagU Telugu Desk
Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 21న ఆయన తన ప్రియురాలు సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో ధావన్ తన మాజీ భార్య ఆయేషా ముఖర్జీ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ తప్పుడు ప్రచారంపై ధావన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన శిఖర్ ధావన్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌లో.. ధావన్ తన మాజీ భార్యకు తగిన బుద్ధి చెప్పారని, ఆమె ధావన్‌కు ఇంకెప్పటికీ పెళ్లి కాదని శాపనార్థాలు పెట్టిందని క్లెయిమ్ చేశారు. దీనిపై ధావన్ స్పందిస్తూ తాను ఎప్పుడూ అలాంటి మాటలు అనలేదని స్పష్టం చేశారు.

Also Read: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

ధావన్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో ఇలా రాశారు

నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు నా దృష్టికి వచ్చాయి. నేను మైదానంలో ఉన్నా, బయట ఉన్నా పాత విషయాలను మర్చిపోయి ముందుకు సాగడానికే ఇష్టపడతాను. నేను సానుకూలతను నమ్ముతాను. నా గతాన్ని గౌరవిస్తాను. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీడియా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను కృతజ్ఞతుడిని. దయచేసి క్లిక్‌బైట్ కోసం నా పేరుతో తప్పుడు స్టేట్‌మెంట్లు ప్రచారం చేయకండి. మనం ప్రేమను, సానుకూలతను పంచుదాం. ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు.

ధావన్ రెండో పెళ్లి విశేషాలు

శిఖర్ ధావన్- ఆయేషా ముఖర్జీ అక్టోబర్ 2023లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో ధావన్, సోఫీ షైన్ అనే మహిళతో కలిసి కనిపించారు. వీరిద్దరూ యూఏఈ (UAE)లో కలుసుకున్నట్లు సమాచారం. మే 2025లో వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. చివరకు జనవరి 12, 2026న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఫిబ్రవరి 21న వివాహ బంధంతో ఒకటయ్యారు.

  Last Updated: 24 Feb 2026, 01:58 PM IST