Sania Mirza: ‘‘గర్భం దాల్చడం ఒక అద్భుతమైన అనుభవం. అయితే బిడ్డకు పాలివ్వడం మాత్రం కష్టంగా అనిపించింది’’ అని స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా చెప్పుకొచ్చారు. ‘‘నేను నా కొడుకుకు 3 నెలల దాకా చను పాలను తాగించాను. అయితే ఆ సమయం చాలా కష్టంగా గడిచింది. అందుకే మరో మూడుసార్లు నేను ప్రెగ్నెంట్ కావడానికైనా రెడీ కానీ.. పిల్లలకు చనుపాలు పట్టడం ఇక నా వల్ల కాదు. అలా చేయగలనో లేదో ప్రస్తుతానికి నాకైతే తెలియదు’’ అని ఆమె కామెంట్స్ చేశారు. తాజాగా మాసూమ్ మీనావాలా అనే యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. ఉగ్రదాడిపై మోడీ సీరియస్
అది శారీరక మార్పు మాత్రమే కాదు
“తల్లి కావడం, గర్భం దాల్చడం అనేది కేవలం శారీరకపరమైన మార్పు కాదు. అది భావోద్వేగపరమైన, మానసికపరమైన అంశం కూడా. ఈవిషయాన్ని ఎవ్వరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. బిడ్డకు జన్మనిచ్చాక ప్రతీ మహిళకు తల్లిగా బాధ్యతలు పెరుగుతాయి. బిడ్డ ఆలనాపాలన చూడాల్సి వస్తుంది. సరైన నిద్ర కూడా ఉండదు. అలాంటి ఒత్తిడినంతా నేను చవిచూశాను’’ అని సానియామీర్జా చెప్పుకొచ్చారు.
Also Read :Maoists Tunnel : కర్రెగుట్టల్లో భారీ సొరంగం.. మావోయిస్టుల కదలికలపై కీలక సమాచారం
నా కొడుకు కోసమే టెన్నిస్ వదిలేశా
‘‘నేను నా కొడుకు కోసమే టెన్నిస్‌కు(Sania Mirza) దూరమయ్యాను. నా కొడుకు బాగోగులను చూసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడికి తగినంత సమయాన్ని కేటాయించడానికే నేను టాప్ ప్రయారిటీ ఇచ్చాను. మిగతావన్నీ పక్కన పెట్టాను. పిల్లల పెంపకం విషయంలో తల్లికి కీలక బాధ్యత ఉంటుంది. అదే నేను నెరవేరుస్తున్నాను’’ అని సానియా మీర్జా తెలిపారు. సానియా మీర్జాకు పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో 2009లో పెళ్లి జరిగింది. 2024 జనవరిలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సానియా తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.