Site icon HashtagU Telugu

R.Ashwin: ఐపీఎల్‌కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై.. 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు.!

Ashwin IPL Earned

Ashwin IPL Earned

R.Ashwin : భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిమానులకు షాకిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని నెలల్లోనే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో 16 ఏళ్ల పాటు ఐపీఎల్‌తో ఉన్న ఆయన అనుబంధానికి తెరపడింది. ఈ విషయాన్ని అశ్విన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. “ప్రతి ముగింపుకు ఒక కొత్త ప్రారంభం ఉంటుందని అంటారు. ఐపీఎల్ క్రికెటర్‌గా నా ప్రయాణం ఈ రోజుతో ముగుస్తోంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆటగాడిగా నా కొత్త ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఇన్నేళ్లుగా నాకు అద్భుతమైన జ్ఞాపకాలను, సంబంధాలను అందించిన అన్ని ఫ్రాంచైజీలకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా, నాకు ఇంతటి గుర్తింపు ఇచ్చిన ఐపీఎల్ మరియు బీసీసీఐకి కృతజ్ఞతలు. భవిష్యత్తులో రాబోయే అవకాశాలను ఆస్వాదించడానికి, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను,” అని అశ్విన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Hyderabad: ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

38 ఏళ్ల అశ్విన్, గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే (619) తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు (537) తీసిన రెండో బౌలర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో అత్యంత తెలివైన ఆటగాళ్లలో అశ్విన్ ఒకరిగా పేరుగాంచారు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున అరంగేట్రం చేశారు. పదేళ్ల విరామం తర్వాత రూ.9.75 కోట్లకు తిరిగి CSK జట్టులోకి చేరిన ఆయన, 2025 సీజన్‌లో తన చివరి మ్యాచ్‌ను కూడా పసుపు జెర్సీలోనే ఆడటం విశేషం. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్, 30.22 సగటుతో 187 వికెట్లు పడగొట్టారు.

4/34 అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. బ్యాటింగ్‌లోనూ రాణించిన ఆయన, 13.02 సగటుతో 833 పరుగులు చేశారు. ఇందులో ఒక అర్ధశతకం (50) కూడా ఉంది. 2010, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించారు.

Telangana Cabinet : క్యాబినెట్ భేటీ 30కి వాయిదా