Site icon HashtagU Telugu

PVR Inox : బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో బిగ్ డీల్

Pvr Inox Bcci Ipl Matches Cinemas

PVR Inox : ఇవాళ(శనివారం)  ఐపీఎల్-2025 సీజన్ షురూ కాబోతోంది. ఈ తరుణంలో క్రికెట్ లవర్స్‌కు ఒక గుడ్ న్యూస్ వినిపించింది. ఐపీఎల్ మ్యాచ్‌లను దేశంలోని 30కిపైగా నగరాల్లో ఉన్న  తన సినిమా హాళ్లలో పీవీఆర్ ఐనాక్స్  ప్రదర్శించనుంది. దీనికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో  పీవీఆర్ ఐనాక్స్  ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో రాబోయే రెండు నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లను పీవీఆర్ ఐనాక్స్‌లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఐపీఎల్‌ సీజన్‌లోని  వీకెండ్ మ్యాచ్‌లు, ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌లు, ఫైనల్‌ను పీవీఆర్ ఐనాక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Also Read :MLA Rajasingh: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రాజాసింగ్ సంచలన కామెంట్స్

అత్యాధునిక సదుపాయాలు

డాల్బీ సౌండ్, హై క్వాలిటీ విజువల్స్, చక్కటి సీటింగ్‌ సదుపాయాలు పీవీఆర్ సినిమాస్‌లో ఉంటాయి.  గతేడాది కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను పీవీఆర్ ఐనాక్స్‌లో ప్రసారం చేశారు. వాటికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈసారి కూడా ఆ మ్యాచ్‌లను  ప్రదర్శించాలని పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయించింది.

Also Read :Bangladeshi Hand : నాగ్‌‌పూర్ అల్లర్ల వెనుక ‘బంగ్లా’ హస్తం ..విదేశీ కుట్ర ?

దేశంలోని ఈ నగరాల్లో.. 

దక్షిణాదిన అన్ని రాష్ట్రాల మెట్రో నగరాలు, పట్టణాలతో పాటు టైర్-2, టైర్-3 సిటీల్లో ఉన్న పీవీఆర్ సినిమాస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తారు. ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలలో ఉన్న నగరాలు, టైర్-2, టైర్-3 సిటీల్లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రదర్శిస్తారు. దేశంలోని సిటీకి సిటీకి మధ్య షెడ్యూల్‌లో తేడా ఉంటుందని పీవీఆర్ ఐనాక్స్  పేర్కొంది. మరిన్ని వివరాల కోసం పీవీఆర్‌ ఐనాక్స్‌(PVR Inox) వెబ్‌సైట్ లేదా యాప్‌ను సంప్రదించాలని సూచించింది. ఎంతోమంది క్రికెట్ ప్రియులు, సినీ ప్రియులు ఈవిధంగా సినిమా థియేటర్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి ఆసక్తి చూపుతుంటారు. వారికి ఇది గొప్ప అవకాశం.

Also Read :Gold Prices: అల‌ర్ట్‌.. ఏప్రిల్ 2 నుండి పెర‌గ‌నున్న బంగారం ధ‌ర‌లు..!