Pakistan Skipper: హనీట్రాప్‌లో స్టార్ క్రికెటర్.. సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌‌తో వీడియో కాల్స్..?

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Pakistan skipper Babar Azam) పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటివరకు అతని కెప్టెన్సీ ప్రమాదంలో ఉంది. కానీ ఇప్పుడు అతని ఇమేజ్ కూడా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. బాబర్ ఆజం హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు.

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 08:05 AM IST

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Pakistan skipper Babar Azam) పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటివరకు అతని కెప్టెన్సీ ప్రమాదంలో ఉంది. కానీ ఇప్పుడు అతని ఇమేజ్ కూడా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. బాబర్ ఆజం హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. నివేదికల ప్రకారం.. పాక్ జట్టులోని ఓ క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ అతడిని ట్రాప్ చేసిందని సమాచారం.దీనికి సంబంధించిన వీడియో ఒక్కటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాక్ జట్టులోని ఓ క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ అతడిని ట్రాప్ చేసిందని సమాచారం. నువ్వు నాతో ఇలాగే వీడియో కాల్స్, చాట్ చేస్తే నీ బాయ్ ఫ్రెండ్ టీమ్‌లో నుంచి బయటకు వెళ్లడు అంటూ తోటి క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌కు బాబర్ ప్రామిస్ చేశాడని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాబర్ ఆజమ్ ఆమెతో వీడియో కాల్స్, చాటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Maruti Suzuki Jimny: రూ.11 వేలకే మారుతి కార్ బుకింగ్ చేసుకునే ఛాన్స్.. ఫీచర్స్ ఇవే?

బాబర్ కెప్టెన్సీలో గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా పాకిస్థాన్ కెప్టెన్‌కు సంబంధించిన పలు వ్యక్తిగత చిత్రాలు, ఆడియో రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే పాక్ కెప్టెన్ చిత్రాలపై దుమారం రేగింది. అయితే, బాబర్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ పన్నాగం ఉపయోగించారని కూడా కొందరు భావిస్తున్నారు. బాబర్ ఆజం గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఆ మహిళ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. ఈ కేసులో బాబర్‌పై కేసు నమోదు చేయాలని లాహోర్ కోర్టు ఆదేశించింది. 2020లో పెళ్లి సాకుతో పాకిస్థాన్ కెప్టెన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆ తర్వాత అబార్షన్ చేయించాడని ఓ మహిళ ఆరోపించింది.

ప్రస్తుతం బాబర్ కెప్టెన్సీకి కూడా ముప్పు ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబర్ ఆజమ్ కెప్టెన్సీ విషయంలో అసంతృప్తిగా ఉంది. బాబర్‌కు జట్టులో పట్టు తగ్గుతోందని, మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న షాన్ మసూద్ కెప్టెన్సీకి బలమైన పోటీదారుగా ఉన్నాడు.