MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్లో తొలి విజయం

వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.

MI vs DC: వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్  విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ అత్యధికంగా 49 పరుగులు నమోదు చేయగా, ఇషాన్ కిషన్ 42 పరుగులతో సత్తా చాటాడు. జట్టు సారధి హార్దిక్ పాండ్యా 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. డేవిడ్ ఉన్నంతసేపు ముంబై జట్టు స్కోర్ పరుగులు పెట్టింది. డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక చివర్లో రొమారియో షెపర్డ్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. షెపర్డ్ కేవలం 10 బంతుల్లో 39 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడింది. పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశారు. పృథ్వీ షా 66 పరుగులతో రాణించగా, అభిషేక్ 41 పరుగులతో సత్తా చాటాడు. ఇక చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ ముంబై బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అయితే ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో ఢిల్లీ ఓటమి చెందింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జాయ్ రిచర్డ్‌సన్, ఎన్రిక్ నార్కియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.

Also Read: MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్లో తొలి విజయం